విత్ డ్రా మాత్రమే కాదు ఇకపై డిపాజిట్లు కష్టమే..! Deposits above Rs 5K can be made only once per a/c till Dec 30

Rbi puts curbs on deposits above r5 000

RBI, Deposits, specified bank notes, Demonetisation, new conditions, kyc account, banknotes, Ashvin Parekh, Rajnish Kumar, demonetisation, PM modi, Arun jaitley

Tenders of old banknotes in excess of Rs 5000 into a bank account will be received for credit only once during the remaining period till December 30, 2016.

విత్ డ్రా మాత్రమే కాదు ఇకపై డిపాజిట్లు కష్టమే..!

Posted: 12/19/2016 04:55 PM IST
Rbi puts curbs on deposits above r5 000

నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణం నుంచి ఇప్పటి వరకు సామాన్యులు బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడుతు అనేక అవస్థలు పడుతున్నారు. అయితే వీరిలో డిపాజిట్లు చేసే వారి సంఖ్య కన్నా అవసరానికి డబ్బులు విత్ డ్రా చేసుకునే వారి సంఖ్యే అధికంగా వుంది. అయితే ప్రభుత్వం డిపాజిట్లు చేసే వారితో క్యూ లైన్లు పెరిగి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భావిస్తున్నట్లు వుంది.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై విత్ డ్రా చేసుకునే వారికే కాదు డిఫాజిట్లు చేయాలనుకున్న వారకి కూడా కష్టాలు తప్పలా లేవు. పాత నోట్లు డిపాజిట్‌ చేయడంపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్‌ చేయాలంటూ నిబంధన పెట్టింది. దీని ప్రకారం ఓ వ్యక్తి ఒక్కసారి మాత్రమే రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధన ఈ నెలాఖరి వరకు వర్తించనున్నట్లు అర్బీఐ తన ప్రకటనలో పేర్కోంది.

అంతేకాకుండా, గతంలో ఈ పాత నోట్లను ఎందుకు జమ చేయలేదని, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి, అది వారిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్‌ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్‌ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కేవైసీ పత్రాలు ఉంటేనే తీసుకోవాలని, లేదంటే కేవలం 50 వేలు మాత్రమే డిపాజిట్‌ చేసుకోవాలని కూడా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అలాంటి పరిస్థితి ఏర్పడిన ఖాతాలను అధికారులు ఒకసారి పునఃపరిశీలించాలని కూడా చెప్పింది. థర్డ్‌ పార్టీ ఖాతాలో డబ్బు వేయాలని భావించినప్పుడు వారి నుంచి అనుమతి తీసుకున్నట్లుగా ఆధారం చూపించే జమ చేయాల్సి ఉంటుందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles