రాహుల్ పర్యటన తమకే లాభం అంటున్న బీజేపి సీఎం Goa CM Laxmikant Parsekar takes potshots at Rahul Gandhi

Goa cm laxmikant parsekar takes potshots at rahul gandhi

laxmikant parsekar, parsekar, goa cm, rahul gandhi, gandhi, Vijay Sankalp rally, Margao constituency, Mauvin Godinho, Manohar Asgaonkar, parsekar rahul gandhi, goa elections, india news, latest news

The Chief Minister also claimed that Rahul Gandhi had told local leaders to gather 50,000 people for his Goa rally but only a few thousands turned up.

రాహుల్ మళ్లీ మళ్లీ రావాలని కోరుతున్న బీజేపి సీఎం

Posted: 12/19/2016 10:44 AM IST
Goa cm laxmikant parsekar takes potshots at rahul gandhi

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా పర్యటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఆయన పదే పదే వస్తే అది తమ పార్టీకే లాభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు రాహుల్ గాంధీ పదే పదే తమ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలో బాగంగా రావాలని అకాక్షించారు కూడా. అయితే రాహుల్ రావడం వల్ల ఆ పార్టీకి చెందిన నాయకులు క్రమక్రమంగా దూరమవుతున్నారని అయన ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఎన్ని పర్యాయాలు తమ రాష్ట్రంలో పర్యటిస్తే తమకు అంత లాభం చేకూరుతుందని ఆయన వ్యంగవ్యాఖ్యలు చేశారు. రాహుల్ అలా అడుగుపెట్టారో లేదో, పలువురు నేతలు ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పారు. ''గోవాలో రాహుల్ గాంధీ పర్యటన ప్రభావం ఏంటో చూడండి.. మొదటిరోజు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు'' అని మార్గోవా నియోజకవర్గంలో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా పర్సేకర్ అన్నారు. ఈనెల 17వ తేదీ శనివారం నాడు రాహుల్ గాంధీ గోవాలో పర్యటించగా.. అదే రోజు ఆ పార్టీ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
 
రెండో రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోహర్ అస్గావ్‌కర్ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని.. ఇప్పుడు ఇంకెంత మంది ఆ పార్టీని వీడి బయటకు వస్తారో చూడాల్సి ఉందని అన్నారు. అస్గావ్‌కర్ ఎంజీపీలో చేరారు. తన ర్యాలీకి కనీసం 50 వేల మంది తక్కువ కాకుండా తీసుకురావాలని స్థానిక నాయకులకు రాహుల్ గాంధీ చెప్పగా.. కేవలం కొన్ని వేల మంది మాత్రమే వచ్చారని సీఎం అన్నారు. బస్సులన్నీ ఖాళీగా వచ్చాయని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : laxmikant parsekar  goa cm  rahul gandhi  goa elections  india news  

Other Articles