సబ్సీడి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెంపు Price of subsidised LPG hiked

Gas cylinders to cost more price of subsidised lpg hiked

LPG, LPG Price Rise, Gas Cylinder, Diesel, Kerosene, Price rise, petrol price hike, diessel price hike, pertol, oil companies

The rate of subsidised LPG rate was hiked and it will now cost Rs 432.71 per 14.2-kg cylinder as against Rs 430.64 previously.

నిన్న పెట్రోల్.. ఇవాళ గ్యాస్.. వాతలపైన వాతలు..

Posted: 12/01/2016 05:04 PM IST
Gas cylinders to cost more price of subsidised lpg hiked

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి, నల్లధనం హరించుకుపోయి.. నిత్యావపర సరుకుల ధరలతో పాటు ఇందన ధరలు కూడా కిందకు దిగివస్తాయని, దాంతో పాటు సబ్సీడీ ఎల్పీజీ ధరలు కూడా తగ్గుముఖం పడుతాయని ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మాత్రం అటు నోటు పోటుతో పాటు ఇటు ధరల పోటును ప్రజలపైకి ఎక్కుపెట్టింది. విమానయాన రంగానికి అందించి ఇంధనంపై ధరలు తగ్గించిన కేంద్రం.. ఇటు సబ్సీడి కింద సామాన్యులు, పేదలు తీసుకునే ఎల్పీజీ సిలిండర్లపై మాత్రం ధరలను పెంచింది.

ఇప్పటికే ఇంధన ధరలతో పాటు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని, ఇకపై ఆదాయపన్నులో కూడా పరిమితులను పెంపు వుంటుందని సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతుంది. అయితే అందుకు పూర్తి భిన్నంగా కేంద్రం ధరల పెంపుకు సమ్మతిని తెలపింది. ఇప్పటికే పెట్రో వాహనధారులకు వాత పెట్టిన ఇంధన సంస్థలు ఇక సబ్సీడీ ఎల్పీజీ సిలిండర్లల వినియోగదారులపై కూడా భారాన్ని మోపింది.

వంట గ్యాస్‌ ధర ఆరు నెలల్లో ఏడోసారి పెరిగింది. తాజాగా ఎల్పీజీ సిలిండర్‌ ధర 2.07 రూపాయలు పెరిగింది. కాగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర 3.7 శాతం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర ప్రస్తుతం 432.71 రూపాయలు. నవంబర్‌ 1న ఎల్పీజీ సిలిండర్‌ ధరను 2.05 రూపాయలు పెంచారు. ఎల్పీజీ సిలిండర్‌ ధర ప్రతి నెలా దాదాపు 2 రూపాయలు పెరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG  LPG Price Rise  Gas Cylinder  Diesel  Kerosene  Price rise  

Other Articles