దీదీకి మోదీ అంటే అంత పగ ఎందుకు? | Shiv Sena to join Mamata Banerjee in Parliament

Wb cm mamata banerjee leads march to president

Mamata Banerjee, West Bengal Chief Minister, Mamata Banerjee March, Mamata Banerjee Demonstration, Mamata Banerjee Modi, Mamata Banerjee Shiva sena, Mamata Banerjee siva sena, Mamata Banerjee BJP, Mamata Banerjee Parliament, Mamata Banerjee, Mamata Banerjee Pranab Mukharjee

BJP Ally Shiv Sena also Will Join Mamata Banerjee's March Against Notes Ban.

దీదీకి పులి పంజా కూడా తోడయ్యిందండోయ్...

Posted: 11/16/2016 08:07 AM IST
Wb cm mamata banerjee leads march to president

జాతి విస్తృత ప్రయోజనాలరీత్యా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి వారం గడుస్తోంది. ఇది దేశంలోని కొన్ని వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. సామాన్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజు నుంచి రోజూ ఏదో ఒక ప్రధాని ఈ విషయంపై ప్రసంగం ఇస్తూనే ఉన్నారు. దీంతో విపక్షాలకు విమర్శలకు మంచి ఊతం ఇచ్చినట్లు అవుతోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మెజారిటీ ప్రజలు దీనిని స్వాగతిస్తుండగా, విపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఢిల్లీ అధికార పక్షం ఆప్ ఈ విషయంలో ఓ మెట్టు పైనే ఉన్నాయి. ఇక ఒక్క నిర్ణయంతో దేశ ప్రజలను బిచ్చగాళ్లను చేశారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తీవ్రంగా మండిపడ్డారు. అసలు నిర్ణయం వెలువడిన తర్వాత తొలిగా విరుచుకుపడింది ఆమెనే. అంతేకాదు బుధవారం రాష్ట్రపతి దగ్గరికి అన్ని పార్టీలతో మార్చ్ నిర్వహించి, భేటీ అవ్వాలని చూస్తున్నారు.

ప్రధాని నిర్ణయంతో దేశ ప్రజలు పనులన్నీ వాయిదా వేసుకుని, బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు క్యూకట్టారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసిన ఆమె, ఇతర పార్టీలు కలిసి వచ్చినా, రాకున్నా తమ పార్టీకి చెందిన 40 మంది ఎంపీలతో కలిసి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని ప్రకటించింది కూడా. అయితే ఈ పోరాటంలో అన్ని పార్టీలు కలిసి వస్తే బాగుంటుందని ఆమె సూచించారు.

ఇక బీజేపీ మిత్రపక్షం శివసేన పెద్ద షాకే ఇచ్చింది. మహారాష్ట్రలో కమలంతో అధికారం పంచుకుంటున్న శివసేన పెద్ద నోట్ల రద్దును మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మమతా సేన చీప్ ఉద్దవ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడగా, మార్చ్ కి తమ నేతలు కూడా హాజరవుతారని ఆయన హామీ ఇచ్చాడని తెలుస్తోంది. అంతేనా.. పార్లమెంట్ లో కూడా దీదీ గొంతుకకు వీరు మద్ధతు కూడా ఇవ్వబోతున్నారు. అంతకు ముందు జమ్ము కశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆమెకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీల నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.

మరోవైపు కురువృద్ధుడు ములాయం, యువనేత రాహుల్ పోరాటానికి మద్ధతు ఇస్తామిన చెప్పినప్పటికీ, మార్చ్ లో మాత్రం పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసేశారు. చివరి నిమిషంలో ఇంకొన్ని పార్టీలు కలిసే అవకాశం ఉంది. ఇంకోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. అధికార పక్షంపై నిప్పులు కురిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతుండగా, వారికి దీటైన సమాధానం చెప్పేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉంది.

పార్లమెంటు సాక్షిగా ఈ విషయంపై చర్చకు సిధ్ధపడింది. ‘మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. చర్చించండి. వాదించండి. కానీ సమావేశాలను సజావుగా సాగనివ్వండ’ని అంటూ ప్రధాని అఖిలపక్ష సమావేశంలో తెలిపిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  Demonstation March  President Pranab  Siva Sena  

Other Articles