తన ఓటమికి కారణం ఎవరన్నది చెప్పిన హిల్లరీ Hillary blames FBI chief for her defeat

Heartbroken hillary clinton blames one person for defeat

US presidential elections, hillary clinton, FBI, FBI director James Comey, e-mail probe, donald trump, emocratic party, republican party, hillaru clinton emails probe, hillary confident

Hillary Clinton blamed FBI director James Comey for her defeat in presidential election, according to two participants who were on a conference call she made with her top campaign funders

తన ఓటమికి కారణం ఎవరన్నది చెప్పిన హిల్లరీ

Posted: 11/13/2016 12:26 PM IST
Heartbroken hillary clinton blames one person for defeat

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తరువాత ఎందుకు ఓటమి పాలయ్యామా అని పోస్టుమార్టం చేసుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ విషయంలో క్లారిటీకి వచ్చారు. తన ఓటమికి కారణం ఎవరో కాదు కేవలం ప్రభుత్వ అధికారులేనని తేల్చారు. అదేంటి అని డౌట్ గా చదువుతున్నారా..? అవసరం లేదండీ.. అమె నిజంగానే ప్రభుత్వ అధికారులే తన ఓటమికి కారణంగా పేర్కోన్నారు. అంటే అందరూ కాదండీ కేవలం ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ మాత్రమే తన ఓటమికి కారణంగా హిల్లరీ క్లింటన్ అరోపించారు.

ఈ-మెయిళ్ల వ్యవహారం కేసును మళ్లీ తెరవడంతో తన విజయావకాశాలపై అది ప్రభావం చూపిందని చెప్పారు. నిధుల సేకర్తలు, విరాళకర్తలతో జరిగిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు అమెరికాలోని మీడియా సంస్ధలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ-మెయిళ్ల వ్యవహారంపై కాంగ్రెస్ కు కామీ రాసిన రెండు లేఖల వల్ల రెండు కీలక రాష్ట్రాలను రిపబ్లికన్లు గెలుచుకున్నారని ఆమె వాపోయినట్లు తెలిసింది.

ఎన్నికల్లో ఓటమికి పలు కారణాలు ఉంటాయని హిల్లరీ పేర్కొన్నా.. కామీ లేఖలే ఎక్కువ ప్రభావం చూపాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మూడు డిబేట్లలో మంచి పోటీని ఇచ్చి ట్రంప్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సమయంలో ఎఫ్ బీఐ డైరెక్టర్ ప్రకటన తన అవకాశాలను దెబ్బతీసిందని సమావేశంలో హిల్లరీ చెప్పినట్లు తెలిసింది. దీంతో అప్పటివరకూ తన విజయం ఖాయమని చెబుతున్న పోల్స్ అన్నీ తారుమారవడం ప్రారంభించాయని ఆమె పేర్కొన్నారని సమావేశానికి హాజరైన ఓ విరాళకర్త చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles