కొత్త కరెన్సీ: కాన్సెప్ట్ బాబు.. కలర్ కేసీఆర్? | Chandrababu and KCR behind new currency notes

Chandrababu and kcr behind new currency notes

KCR and Chandrababu new currency notes, Modi New Currency Chandrababu, KCR new Currency, Mans behind Modi's new Currency plan, Narendra modi New Currency speech, PM Narendra Modi black Money, Narendra Modi telugu states Chief Ministers

KCR and Chandrababu behind Modi's new currency notes decision.

కొత్త కరెన్సీకి ఆ ముగ్గురే కారణమా??

Posted: 11/09/2016 07:56 AM IST
Chandrababu and kcr behind new currency notes

దేశం మొత్తం ఇప్పుడు కుదిపేస్తున్న ఏకైక అంశం 500, 1000 రూపాయల నోట్లు. నల్ల కుబేరుల గుండెల్లో రైల్లో పరిగెత్తించే అంశంపై సాధారణ జనం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం, ఆర్బీఐ స్పష్టంగా చెప్పేస్తున్నాయి. అయితే అధికారులకు కూడా లీకేజీ ఇవ్వకుండా మోదీ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం వెనక ఉంది ఆ ఇద్దరే అంటూ (మోదీతో కలిపి ముగ్గురు) ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకరు కీలకమైన డెసిషన్ తీసుకున్న మోదీ కాగా, మరో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులట. అవును...

రూ.500 - 1000 నోట్లను రద్దు చేసేలా ప్రధాని మోడీకి సిఫార్సు చేస్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన మాట ఇది. తాజాగా ఓ పదిహేను రోజుల క్రితం కూడా బాబు ఈ మాటను ప్రస్తావించాడు. అయితే అదంత విన్న కొందరు బాబుకు పైత్యం తలకెక్కిందనుకున్నారు. 500, 1000 నోట్లను రద్దు చేయించి, కేంద్రం రూ.2000 నోట్లను తీసుకొస్తానని సూచించడంతో చంద్రబాబుది అంతా పిచ్చితనం అనుకున్నారు. కానీ.. చంద్రబాబు నిజంగా ప్రధానికి చెప్పారా... చంద్రబాబు చెబితే ప్రధాని విన్నారా అన్నట్లుగా మోదీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలు రాత్రి నుంచే మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నా పోరాటం ఫలించింది...

దీనిపై చంద్రబాబు కూడా స్పందించాడు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థగా నల్లధనం విస్తరించడానికి పెద్దనోట్లే కారణమని పేర్కొన్నారు. నల్లధనం వల్ల ద్రవ్యోల్బణంతోపాటు రాజకీయ రంగం, పాలనా రంగాల్లో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. వీటి రద్దు వల్ల ఇక నుంచి అలా జరిగే పరిస్థితి ఉండదన్నారు. 


వెయ్యి రూపాయల నోట్లను దాచినంత తేలిగ్గా రూ.100 నోట్లను దాచలేరని, అందుకే చాలా కాలంగా పెద్ద నోట్లను రద్దు చేయాలని పోరాడుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టే సంస్కరణల్లో రూ.5 వేలకు పైబడిన లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానో, కార్డుల ద్వారానో జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డబ్బు పిచ్చికి ఇక బ్రేకులు పడతాయని పేర్కొన్న చంద్రబాబు రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గుతుందని, దీని కోసమే ఇంతకాలం పోరాడామని వివరించారు.

అయితే ప్రధాని కేవలం చంద్రబాబు చెప్పాడనే ఈ నిర్ణయం అమలు చేశాడని భావించలేం. అలాగని ఎన్టీయే ప్రభుత్వానికి మద్ధతునిచ్చే కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేతగా , ఓ సీనియర్ నేతగా బాబు ఇచ్చిన సూచనను పరిగణనలోకి  తీసుకున్నాడని అనుకుందాం. ఇదిలా ఉంటే మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేశారంటారా?

ఇది అసలు సహేతుకం కాపోయినా చూడండి. పెద్ద నోటుగా వెయ్యి స్థానంలో రెండు వేల నోటు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నోటు పింక్ రంగులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రంగును ప్రధానికి సూచించింది తెలంగాణ సీఎం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దేశం మొత్తం మీద పెద్ద నోటుగా చెలామణి కాబోతున్న ఈ కెరెన్సీకి ఆ రంగును సూచించి దేశం మొత్తం పింక్ మయం చేయాలని కేసీఆర్ ఫ్లాన్ చేస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు అమెరికాలో ఓట్లు కౌంటింగ్ చేస్తుంటే... ఇండియాలో పాత నోట్ల కౌంటింగ్ జరుగుతుందంటూ... వీటితోపాటు 3, 5, 7, 9 రూపాయల బిళ్లలను కూడా ప్రవేశపెట్టాలని మరికొందరు, ఇలా మోదీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంపై రాత్రి నుంచే సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  New Currency Concept  Chandrababu Naidu  KCR  

Other Articles