1000, 500 నోట్లు ఇక చెల్లని కాగితాలు | Modi's surgical strike on black money

Modi s surgical strike on black money

Modi's surgical strike on black money, Narendra Modi 1000 and 500 Rupees, New 500 and 1000 Rupees, New RBI notes, Old Currency in India, Modi Currency Decision, Currency in India, New Notes in India, 500 and 1000 new official notes, RBI new notes

PM Narendra Modi says Rs 500 and Rs 1000 notes will not be legal anymore. New Currency will introduced very soon.

నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం

Posted: 11/09/2016 07:33 AM IST
Modi s surgical strike on black money

సర్జికల్ స్ట్రయిక్స్ ను తలపించేలా ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో నల్లధనం అరికట్టమే ముఖ్యోద్దేశ్యంగా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎలాంటి లీకేజ్ లేకుండా కరెన్సీ నోట్ల రద్దు హఠాత్తుగా ప్రకటించడంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది.

నిన్న సాయంత్రం త్రిదళాధిపతులతో భేటీ అయిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. వాటి స్థానంలో కొత్త 500 నోట్లు, 2000 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీపావళి మరునాడు వీధుల్లో చెత్తను ఊడ్చేసినట్లుగా, దేశంలో నల్లధనాన్ని ఊడ్చేద్దాం అంటూ పిలపునిచ్చారు. రూ.500, రూ.1000 లను డిసెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం లేదా మార్పిడి చేసుకోవటం చేయాలని, అలా చేయని పక్షంలో తమ గుర్తింపుకార్డులు సమర్పించి మార్చి 31 లోపు మార్చుకునే వెసులు బాటును కూడా కల్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయం సాహసోపేతమైనప్పటికీ, నకిలీ కరెన్సీ మాఫియా, బ్లాక్ మనీ అరికట్టేందుకు తప్పవని చెప్పుకొచ్చారు.

మంగళవారం అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు అధికారికం కానుంది. అలాగే ఇకపై రోజుకు గరిష్ఠంగా పది వేల రూపాయల విత్ డ్రాను, వారానికి గరిష్ఠంగా 20 వేల రూపాయల పరిమితిని విధిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని, నవంబర్ 12 వరకు 500 లేదా 1000 రూపాయల నోట్లు మందుల షాపులు, రైల్వే, బస్, విమాన టికెట్ కౌంటర్లు వంటి ప్రాంతాల్లో మాత్రమే చెల్లుతాయని ప్రధాని స్పష్టం చేశారు.

కాస్త ఇబ్బందిపడినా దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లధనం వంటి సమస్యను అరికట్టడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా అంగీకరిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రభుత్వానికి కొమ్ముకాసే కార్పొరేట్లు , అవినీతి ఉద్యోగులు, కోట్లకు కోట్లు పోగేసిన అవినీతి రాజకీయనాయకులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోగలరా? అన్నది కాస్త సందేహమే. అయితే తాజా నిర్ణయంతో ప్రధాని మోదీ ఇమేజ్ అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Currency  500 and 1000 notes  PM Narendra Modi  

Other Articles