కరెన్సీ మార్చుకోవడానికి గడుపు పెంచారా? | Date Extension for old currency notes exchange

Date extension of old 500 and 1000 notes

currency exchange last date, date exchange for old notes, withdrawal cash limit, ATM withdrawal limit, 500 and 1000 rupees notes in ATM, 500 and 1000 notes RIP, Old notes exchange, How exchange old notes in bank,. New 500 and 1000 rupees notes, RBI on new notes

RBI re think about date extension of old 500 and 1000 notes.

పాత నోట్ల ఎక్సేంజికి గడువు పొడిగింపు?

Posted: 11/09/2016 08:33 AM IST
Date extension of old 500 and 1000 notes

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఇది దేశ ప్రధాని కొత్త కరెన్సీ గురించి చేసిన ప్రసంగంలో ఇచ్చిన పిలుపు. దాచుకోడానికి సులువుగా ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త వాటిని వినియోగంలోకి తేవటం ద్వారా ఇప్పటికే లెక్క లేనంతగా మురిగిపోయి ఉన్న నల్ల ధనంను ఏం చేయాలో తెలీయక బ్లాక్ మనీ బాబులు తలలు పట్టుకుంటున్నారు. డిసెంబర్ 30 వరకు పాత కెరెన్సీని మార్చుకునే వెసులుబాటు కల్పించినా లెక్క పక్కా లేని ఆ సొమ్ముతో వారు దొరికిపోవటం ఖాయమనే అనుకోవాలి.

ఇదిలా ఉంటే మరి మాములు జనాల పరిస్థితి ఏంటి? ప్రధాని చెప్పినట్లుగా డిసెంబర్ 30 లోపు మాత్రమే తమ పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని, దానిలో ఎలాంటి పొడగింపు లేదని ఆర్బీఐ కూడా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ ఉర్జిత్ పటేల్ ఓ స్టేట్ మెంట్ లో మొత్తం విధానం వివరించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చాడు.

New five hundred rupees note

new two thousand note

ప్రజలు ఏం చేయాలంటే...

- మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లు చెల్లవని, ఎవరిదగ్గరైనా రూ.500, రూ.1000 నోట్లు ఉంటే వారు డిసెంబర్ 31 లోగా ఆయా నగదును బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేయాలి. ఇలా డిపాజిట్ చేయటంలో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వేళ మార్చుకోవాలనుకుంటే మాత్రం 4000 రూ. మాత్రమే లిమిట్.

- ఈ నెల 24 వరకు హేడ్‌ పోస్టాఫీస్‌ లేదా సబ్‌ పోస్టాఫీస్‌లలో గుర్తింపు కార్డు(ఆధార్, ఓటర్, పాన్ కార్టులు) చూపించి పాత రూ. 500, రూ. వెయ్యినోట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ రూ. 4,000 పరిమితి మాత్రమే ఉంటుంది.

- అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యినోట్ల చెలామణి అవుతాయి. అదేవిధంగా రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, విమాన బుకింగ్‌ కౌంటర్లు, పెట్రోల్‌ బంకులలో 72 గంటల వరకు ఇవి నడుస్తాయి.

- ప్రస్తుతం బ్యాంకు నుంచి ఉపసంహరించే నగదు విషయంలో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 20వేలు వరకు పరిమితిగా మార్చారు. అయితే దీనిని రానున్న రోజుల్లో పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
.
- ఇక చెక్కులు, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండబోవు.

- నవంబర్ 18 దాకా ఏటీఎం కార్డుతో మనీ డ్రా చేసుకుంటే రెండు వేలు మాత్రమే వస్తాయి. నవంబర్ 19 నుంచి ఆ లిమిట్ ను 4 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

- కొత్త సిరీస్ లో 500, 2000 లతో పాటు, రూ.10, రూ. 20, రూ.50, రూ.100 నోట్లు కూడా వస్తాయని ఉర్జిత్ వెల్లడించారు. అయితే చిన్న నోట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఇక డిపాజిట్ల స్వీకరణకు అదనపు కౌంటర్లు, సమయం కేటాయించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

- డిసెంబ‌రు 31 వ‌ర‌కు మార్చుకోలేని వారు ఆ త‌రువాత మార్చి 31 వ‌ర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేసి మార్చుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ఇతరులతో డిపాజిట్లు వద్దు...

విదేశీ శక్తులు నకిలీ రూ.500, రూ.1000 నోట్లను దేశంలో చెలామణి చేస్తున్నాయని, నిజమైన నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేనంతగా ఉన్నాయని ఆర్ బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. నోట్ల మార్పిడి విధివిధానాలను ఆర్ బీఐ రూపొందించిందని, రూ.500, రూ.2 వేల రూపాయల కొత్త నోట్లు జారీ చేస్తామని, ప్రజల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇతరుల సొమ్మును మీ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వొద్దని, కొత్త నోట్లు నవంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు. ప్రధాని ఇలా ప్రకటించిన వెంటనే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నోట్లను ప్రదర్శించింది. దీంతో త్వరలో ఇప్పుడు వినియోగంలో ఉన్న నోట్లన్నీ పోయి, కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయి.

ఈరోజు బ్యాంకు.. రెండు రోజులు ఏటీఎంలు బంద్...

బుధవారం బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేశామని, అదేవిధంగా, బుధ, గురు వారాల్లో ఏటీఎంలు పని చేయవంటూ ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఆర్బీఐ వర్గాలు కూడా తెలిపాయి. సాధారణ ప్రజానీకం జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, కొత్త నోట్లను విడుదల చేయాల్సి ఉండటంతో కాస్త భరించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు కూడా దేశ ప్రజలను కోరుతున్నారు. అదే విధంగా మనీ ఎక్సేంజ్ కోసం కమీషన్ ఇచ్చి మరీ దళారులను ఆశ్రయించాల్సిన పని లేదని, పరిమితి విధించినందునా వారు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు పెట్టేసరికి సామాన్యుల కష్టాలు మొదలయ్యాయి. చేతిలో డబ్బు ఉన్నప్పటికీ, అత్యవసర పనులకు డబ్బు చెల్లింపులో సమస్యలు ఎదురవుతుండటంతో ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. చిరు వ్యాపారస్థులైతే వాటిని చెల్లని చిత్తు కాగితాల్లా చూస్తూ... అస్సలు తీసుకోవటం లేదు. దీంతో వంద నోటు కింగ్ గా మారిపోయింది. పోనీ ఈ రెండు రోజులు ఎలాగోలా గడిచినప్పటికీ, ఆ తర్వాత ఉన్న డబ్బును మార్చుకోవటంలోనే మెలికలు ఉండే సరికి వారిలో కంగారు నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  500 and 1000 rupees notes  exchange date  

Other Articles