విమానంలోకి అనుకోని అతిధి.. భయకంపితులైన ప్రయాణికులు Snake Gives Passengers Mid-Flight Scare

Video shows reptile fall from overhead bin on aeromexico flight

snake, aero mexico flight, horrific experience, passengers, Torreon-Mexico City bound flight, POISONOUS snake in flight, POISONOUS snake in plane, Aviation,Disaster Accident,Economy of Mexico,Indalecio Medina,Mexico,Mexico City,Mexico City International Airport,Samuel L. Jackson

Horrified passengers leap out of their seats after a POISONOUS snake slithers out of an overhead locker and dangles above them during a Torreon to Mexico City bound flight

ITEMVIDEOS: విమానంలోకి అనూహ్య అతిధి.. గుప్పిట్లో ప్రయాణికుల ప్రాణాలు

Posted: 11/08/2016 09:46 AM IST
Video shows reptile fall from overhead bin on aeromexico flight

మెక్సికోకు చెందిన ఓ ప్రైవేటు విమానసంస్ధ విమానంలోకి అనుహ్య అతిధి ఎంట్రీ ఇచ్చింది. అతిధిని గమనించిన ప్రయాణికులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. గమ్యస్థానం చేరే వరకు ఏ నిమిషం ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆ అనూహ్య అతిధి ఎవరంటారా..? ఓ విషసర్పం. ’స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్’ హాలీవుడ్ చిత్రాన్ని చూసిందో ఏమో తెలియదు కానీ.. అ విష సర్పం ఏకంగా విమానాన్ని ఎక్కేసింది. అంతటితో అగకుండా ప్రయాణికులను కంగారు పెట్టించి.. ఉరుకులు పరుగుల తీసేలా కూడా చేసింది.

విష సర్పాన్ని చూసిన విమాన సిబ్బంది తొలుత షాక్ కు గురయ్యారు. అ వెనువెంటనే తేరకుని దానిని చాకచక్యంగా బంధించారు. అయితే ఈ యావత్ ఘటన మాత్రం అచ్చంగా బాలీవుడ్ చిత్రం తరహాలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చేధు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏరో మెక్సికోకు చెందిన విమానం టొర్రెన్ నుంచి మెక్సికో నగరానికి బయల్దేరింది. దారి మద్యలో లగేజి కంపార్ట్ మెంట్ వద్దకు వెళ్లిన ఓ ప్రయాణికుడికి అక్కడ పాము కనిపించింది.

దీంతో ముందుగా షాక్ గురైన అతను తేరుకుని.. ఆ దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించాడు. దాదాపు మూడు మీటర్ల పొడవున్న పాము పైనున్న లగేజ్ క్యాబిన్ నుంచి మెల్లిగా కిందకు జారుతుంది. దీంతో ఆయన విమాన సిబ్బందికి సమాచారం అందించాడు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ప్రయాణీకులందరూ పామును గమనించి కంగారుపడ్డారు. విమానంలో ఒక్కసారిగి ఉరుకులు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన విమాన సిబ్బంది ప్రయాణికులను యథాస్థానాల్లో కూర్చోబెట్టారు.

పాము కింద జారి పడకముందే ఐదు వరుసల వరకూ బ్లాంకెట్లతో పాము కింద పడే ప్రదేశాన్ని మూసివేసి.. అది కింద పడగానే దాన్ని బ్లాంకెట్లతో కప్పిసారు. పైలట్లు విషయాన్ని విమానాశ్రయా సిబ్బందికి తెలయజేయడంతో వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద విమాన ల్యాండింగ్ కు క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో విమానం ల్యాండింగ్ కాగానే యానిమల్ కంట్రోల్ వర్కర్లు పామును పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన ఏరో మెక్సికో సంస్ధ విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles