ఐసిస్ కు ముద్దు పేరు పెట్టేసిన భారత్.. వారికి ఎక్కడో కాలుతుంది | Indian Govt to use acronym DAESH in place of ISIS

Indian govt to use acronym daesh in place of isis

ISIS Daesh, Daesh in India, ISIS in India, Not ISIS its DAESH, DAESH in India, India ISIS, ISIS original name, Daesh abbreviation, ISIS group renamed, ISIS fire with DAESH

Indian Home ministry to use 'Daesh' instead of ISIS.

ఐసిస్ కు ముద్దు పేరు పెట్టేసిన భారత్

Posted: 11/08/2016 10:49 AM IST
Indian govt to use acronym daesh in place of isis

మారణహోమమే వారి ముందున్న ఏకైక కర్తవ్యం. అమాయకపు మనుషుల జీవితాలే వారి టార్గెట్. దేశం,, ప్రదేశం ఏదీ వారికి అతీతం కాదు. కిరాతకంగా గొంతులు కోయటం, తగలబెట్టడం, అమ్మాయిలను చెరచటం, ప్రాణాలు బలి తీయటం ఇవి మాత్రమే వారికి తెలుసు. ఆ పేరు చెబితే అగ్రరాజ్యంతో ప్రపంచమంతా వణికిపోతుంది. అదే ఐఎస్ఐఎస్(ఐసిస్). కానీ, కరుడు గట్టిన ఆ ఉగ్రవాద సంస్థకు ఒక్క పేరంటే చాలూ ఎక్కడో కాలుతుంది.

అదే డాయిష్. ఎందుకంటే ప్రపంచ అగ్రదేశాలు, అధినేతలు వాటిని అదే పేరుతో పిలుస్తున్నారు కాబట్టి. ఇకపై భారత్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. అసలు ఇంతకీ దాని అర్థం ఏంటి? అదేమైనా బూతా? భారత్ కూడా ఉన్నపళంగా పేరు ఎందుకు మార్చుతుంది.

‘ఇస్లామిక్ స్టేట్..’ ను ఇక నుంచి ‘డాయిష్’గా సంబోధించాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ కమ్యూనికేషన్లలో ఇక నుంచి ‘ఐఎస్’ అని కాకుండా ‘డాయిష్‌’గా పిలవాలని యోచిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థను ‘ఇస్లామిక్ స్టేట్’గా సంబోధించడం వల్ల జాతీయత లేని ఆ సంస్థకు ఇస్లామిక్ రాజ్య చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాయిష్ అనేది ‘అల్-దవియా అల్-ఇస్లామియా ఫె అల్-ఇరాక్ వ అల్-షామ్’(ది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/షామ్) అనే దానికి సంక్షిప్త పదం. దీనిని ప్రపంచ దేశాలు ఐఎస్ఐఎస్ (ఐసిస్/ఐసిల్)గా వ్యవహరిస్తున్నాయి. అయితే దీనిని ఇస్లామిక్ స్టేట్‌గా పిలుస్తున్నారు.

ఈ ఉగ్రవాద సంస్థకు సరిహద్దులు అనేవి లేవు. ఇది ఇస్లామిక్ గానీ, స్టేటు కానీ కాదని, ఓ ఉగ్రవాద సంస్థ మాత్రమేనని కౌంటర్ టెర్రర్ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ సంస్థను ఇక నుంచి ఇస్లామిక్ స్టేట్‌గా కాకుండా ‘డాయిష్‌’ గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలువురు కీలక దేశాధినేతలు ఐఎస్ఐఎస్ ను డాయిష్ అనే పేరుతోనే పిలుస్తున్నారు. 2015 జనవరిలో అప్పటి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఇకపై తాను ఐఎస్ఐఎస్ అని పిలవబోనని... డాయిష్ అని సంబోధిస్తానని ప్రకటించారు.

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హొలాండే, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా ఐఎస్ ను డాయిష్ గానే పిలుస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ గతంలో సిరియాలో ప్రసంగిస్తూ, ఐఎస్ఐఎస్ ను పలుమార్లు డాయిష్ గా పిలిచారు. 2015 నవంబర్ లో పారిస్ పై ఉగ్రదాడి జరిగిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా డాయిష్ పదాన్ని వాడటం మరీ ఎక్కువైంది. ఈ పదం గురించి ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా వందల రెట్టు పెరిగింది. అయితే, తమను డాయిష్ అని పిలుస్తుండటం ఐఎస్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఆ సంస్థ కోపంతో రగిలిపోతోంది. అంతేకాదు, డాయిష్ అని పిలిచేవారి నాలుకలు కోస్తామంటూ కూడా ఐఎస్ఐఎస్ హెచ్చరించింది.


డాయిష్ అంటే...
ఐఎస్ఐఎస్ కోపానికి ఓ కారణముంది. వాస్తవానికి డాయిష్ (daesh) అనేది ‘అల్-దవియా అల్-ఇస్లామియా ఫె అల్-ఇరాక్ వ అల్-షామ్’ అనే దానికి సంక్షిప్త పదం. కానీ అరబిక్ భాషలో డాయిష్ (daes) అనే పదం కూడా ఉంది. ఈ రెండు పదాలు పలకడానికి ఒకేలా ఉంటాయి. కాలితో దేన్నైనా నలిపి పడేసిన దాన్ని అరబిక్ లో డాయిష్ అంటారు. ఈ నేపథ్యంలో, తమను డాయిష్ అని పిలవడం ద్వారా... తమ స్థాయిని దిగజార్చినట్లేనని అవమానంగా ఐఎసిస్ భావిస్తోంది. అందుకే, తమను అలా పిలిచే వారి నాలుకలు కట్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ, ఈ మానవ మృగాలను అలా పిలవటమే కరెక్టని ప్రపంచదేశాలన్నీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయి పోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Indian Govt  Rename  DAESH  

Other Articles