Baby born on Cebu Pacific airplane gets one million air miles

Cebu pacific gets first baby born inflight

Baby born on Cebu Pacific airplane, Cebu Pacific gets first baby born inflight, first inflight baby gets gift, Philippine carrier, Cebu pacific, dubai to manila, haven recieves bithday gift, Asia Pacific, World news, Air transport

A baby girl born on a flight halfway from Dubai to Manila has received a birthday present: a million air mile points. Cebu Pacific said the baby, named Haven, was the first to be delivered on one of its planes.

గగనతలంలో పుట్టిన పాపాయి.. అదృష్టాన్ని వెంటబెట్టుకొచ్చింది..

Posted: 08/19/2016 11:17 AM IST
Cebu pacific gets first baby born inflight

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడి ఈ చిన్నారి శిశువు విషయంలో అక్షరాల నిజమైంది. తెలుగులో నెల తక్కువ వెధవా అని అంటుంటారు కానీ.. నెలలు తక్కువగా వున్నప్పుడే తల్లి గర్భం నుంచి బయటపడిన పాపాయి బంపర్ అవకాశాన్ని కొట్టేసింది. తనతో పాటు తన తల్లిదండ్రులకు కూడా బంపర్ అఫర్ కల్పించింది. తల్లి నుంచి పేగు బంధాన్ని వీడిన గంటల వ్యవధిలోనే.. అమెను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఏమీటా బంపర్ అఫర్ అంటూ అలోచనలో పడ్డారా..?

ఈ చిన్నారి తన జీవితంలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విమానంలో ఉచితంగా 10 లక్షల ఎయిర్ మైళ్లు ప్రయాణించే అవకాశాన్ని కోట్టేసింది. ఈ మేరకు సెబూ పసిఫిక్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ ప్రకటన చేసింది. ఎందుకంటే... దుబాయి నుంచి మనీలా వెళ్తున్న సెబూ పసిఫిక్ విమానంలోనే ఈ చిన్నారి జన్మించింది. తమ సంస్థ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, అందుకే ఈ పాపకు కుటుంబ సభ్యులతో కలిసి తమ విమానంలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు సెబూ ప్రకటించింది.

కాగా, గగనతలంలో పయనిస్తున్న విమానంలో జన్మించిన పాపాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నెలలు నిండకుండానే పుట్టిన పాపాయి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని అపోలో క్రేడల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విమానం ల్యాండయ్యే సమయంలో పాపాయి శరీరం నీలం రంగులోకి మారి చల్లబడిపోయిందని, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో స్పెషలిస్ట్ టీమ్ ఆమెను తీసుకొచ్చిందని పేర్కొంది. పాపాయి 32 వారాలకే జన్మించిందని, 1.6 కేజీల బరువు మాత్రమే ఉందని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippine carrier  Cebu pacific  dubai to manila  haven  first baby born inflight  

Other Articles