Jayalalithaa's poll victory challenged in Madras high court

Madras high court sends notice to jayalalithaa over rk nagar victory

Tamil Nadu CM, Jayalalithaa, Madras high court, Justice M Duraiswamy, chief election commissioner Nasim Zaidi, RK Nagar constituency, Tamil Nadu assembly polls, booth capture, AIADMK, political news

The Madras high court admitted a petition by an independent candidate from RK Nagar assembly seat where Jayalalithaa won seeking to declare the election as ‘null and void’.

జయలలితను వెన్నాడుతున్న మరో కేసు.. హైకోర్టు తాఖీదులు..

Posted: 08/19/2016 09:43 AM IST
Madras high court sends notice to jayalalithaa over rk nagar victory

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ఇప్పటికే పలు పార్టీలు ప్రకటించగా, తాజాగా అమె మరో కేసుకు సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు నుంచి తాకీదులు అందుకున్నారు. గత మే నెల 16న జరిగిన ఎన్నికలలో గెలుపోందిన అమె విజయం చెల్లదంటూ అమె ప్రాతినిథ్యం వహించిన అర్కె నగర్ నియోజకవర్గం నుంచి పిటీషన్ మద్రాసు హైకోర్టులో దాఖలైంది.

ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రవీణ అనే అభ్యర్థి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విజయాన్ని సవాల్ చేస్తూ ఆర్కే నగర్ నియోజకవర్గం ఎన్నికను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత అక్రమంగా గెలిచారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. పోలింగ్ బూతులను ఆక్రమించి, ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తనను ఎన్నికలలో ప్రచారం చేయనీయకుండా కూడా జయలలిత అనుచరగణం అడ్డుపడ్డారని అమె తన పిటీషన్ లో పేర్కోన్నారు.

ఈ విషయాలను ప్రధాన ఎన్నికల సంఘం అధికారి నసీమ్ జైదీకి కూడా ఫోన్ ద్వారా వివరించగా, ఆయన చర్యలు తీసుకుంటాననని కూడా హామి ఇచ్చారని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమె తన పిటీషన్ లో పేర్కోన్నారు. అక్రమాల నేపథ్యంలో అర్కే నగర్ ఎన్నికను రద్దు చేసిన మరోమారు తాజాగా ఎన్నికలను నిర్వహించాలని పిటీషనర్ హైకోర్టుకు విన్నవించారు. కాగా, ప్రవీణ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం దురైసామి.. ఎన్నికల కమిషన్ అధికారులకు, జయలలితకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 16లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించించారు. మే 16న జరిగిన ఎన్నికల్లో ఆర్ కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ జయలలిత.. డీఎంకే అభ్యర్థి సిమ్లా ముత్తుపై 39,545 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu CM  Jayalalithaa  Tamil Nadu elections  RK Nagar  Madras HC  

Other Articles