Minister Ramdas Athawale: If you do gau raksha, who will do manav raksha?

Union minister ramdas athawale tells dalits to convert religion

ramdas bandu athawale, athawale, dalit, dalit attacks, dalit atrocities in india, dalit buddhism, mayawati, mayawati dalit cause, cow protection act, gau rakshak, una dalit flogging, beef ban, gau raksha, manav raksha, Mayavati, buddism, religion conversion, india news, latest news

Athawale asked the government to ensure that incidents, such as the recent flogging of youths from his community by gau rakshaks in Gujarat’s Una, are not repeated.

మతమార్పిడులు చేసుకోండీ.. మాయావతి మీరునూ: కేంద్రమంత్రి

Posted: 07/30/2016 02:02 PM IST
Union minister ramdas athawale tells dalits to convert religion

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు ప్రస్తుతం ఏ మతంలో వున్నా వారందరూ మత మార్పిడులు చేసుకోవాలని అన్నారు. దళితులందరూ బుద్ధిజంలోకి మారాలని పిలుపునిచ్చారు. బుద్దిజంలో వున్నావారే దళితులుగా పరిగణింపబడతారంటూ అయన పరోక్షంగా ఆ దిశగా ప్రేరేపిస్తూ చేసిన వ్యాఖ్యలు దళితవర్గాల్లో ఒకింత దుమారాన్ని రేపుతున్నాయి. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానని చెప్తున్న మాయావతి ఇంకా ఎందుకు బుద్ధిస్టుగా మారలేదని ఆయన ప్రశ్నించడం కూడా వివాదాస్పదం అయ్యింది. కేంద్ర సామాజిక మంత్రిగా కొనసాగుతూ ఆయన దళితులను మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని దళిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును కేంద్ర మంత్రి కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలావుండగా, మహారాష్ట్రకు చెందిన రాంధాస్ అథావలే ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గో రక్షణ సమితి సభ్యులపై కూడా మండిపడ్డారు. మనుషుల ప్రాణాలు పణంగా పెట్టి గోవుల రక్షణ చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. గోవుల రక్షణ పేరిట మనుషులను చంపుతూపోతే.. మరీ మానవ రక్షణ ఎవరు చేపడతారని ఆయన ప్రశ్నించారు. గుజరాత్‌లోని ఉనా తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆవు చర్మాన్ని వలిచారని ఉనాలో దళిత యువకులని కారుకు కట్టేసి గోరక్షకులు దారుణంగా కొట్టిన ఘటనపై తీవ్రమైనది పేర్కొన్నారు. ‘గోవుల రక్షకులను నేను ఒక్కటే విషయం అడుగుతున్నా.. గో హత్యకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. అయినా, మీరెందుకు గో రక్షణ పేరిట మానవ హత్యలు చేపడుతున్నారు. మీరు ఈ విధంగా గోవుల రక్షణ చేస్తే.. అప్పుడు మనుషులను ఎవరు రక్షిస్తారు?’ అని ఆయన రాంధాస్ ప్రశ్నించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles