అకతాయిల పని పట్టిన అమ్మాయిలు | Kolkata girls beat eve teasers and hand over to cops

Kolkata school girls beat eve teasers and hand over to cops

Kolkata eve teasers, girls beat eve teasers

Harassed for months, a group of schoolgirls and women fought back and dragged four of their tormentors to a police station in Kolkata

ఆకతాయిల తాట తీసిన అమ్మాయిలు

Posted: 07/13/2016 05:47 PM IST
Kolkata school girls beat eve teasers and hand over to cops

అమ్మాయిలే కదా ఏం కామెంట్ చేసినా గప్ చుప్ గా వెళ్లిపోతారని భావించిన ఆ ఆకతాయిలకు అనుకోని పరిణామమే ఎదురైంది. కొంత కాలంగా తమను ఏడిపిస్తున్న నలుగురు యువకులకు ముగ్గురు యువతులు చుక్కలు చూపించారు. స్థానిక మహిళలతో కలిసి ఎడా పెడా దంచి పోలీసులకు అప్పజెప్పారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఈ ఘటన జరిగింది.

జగ్దాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆయుర్వేద కళాశాలలో రోహన్‌ హొస్సేన్‌, సురేష్‌ భూనియా, దీపక్‌ సింగ్‌, బిప్లబ్‌ దేబ్‌ విద్యనభ్యసిస్తూ, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరున్న ప్రాంతం మీదుగా వెళ్లాలంటే అక్కడి అమ్మాయిలకు విపరీతమైన భయం. వీరి కామెంట్లు, కాంప్లిమెంట్లు, వెగటు వ్యాఖ్యలు వినలేక ఇబ్బంది పడతారు. గత కొద్దిరోజులు వారి వ్యాఖ్యలు మరీ హద్దు మీరాయి. అంగంగాలను వర్ణిస్తూ నీచ పదజాలం వాడటంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఈ ఉదయం కూడా వాళ్లు వెళ్తుండగా, ఈ నలుగురు ఆకతాయిలు వారికి అసభ్యకరమైన సైగలు చేయటం ప్రారంభించారు. దీంతో అపరకాళిలా మారిన ఆ విద్యార్థినులు వారిపై తిరగబడ్డారు. జుట్టు, రెండు చెంపలు వాయించే సరికి, యువకులు బెదిరింపులకు దిగారు. ఈ తతంగాన్ని చూస్తున్న స్థానిక మహిళలు వారికి తోడుకావటంతో యువతులకు ధైర్యం వచ్చింది. దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, వారిపై వేధింపుల కేసు నమోదు చేశారు. సో... ఈవ్ టీజర్లు... మందారం లాంటి మృదువైన పువ్వులే కాదు... కింద ముళ్లులు ఉండే గులాబీలు కూడా ఉంటాయి. జాగ్రత్త...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata  School girls  beat  eve teasers  

Other Articles

Today on Telugu Wishesh