red sandal smuggler parthiban konda swamy arrested

Tollywood actress alleges police rude behaviur towards her

International smuggler arrested, parthiban kanda swamy, red sander, International redwood sandal smuggler arrested, parthiban kanda swamy, red sander,

tollywood actress nethu agrawal accused in red sandal smuggling alleges produtoor, cuddapah police rude behaviur towards her.

పోలీసుల తీరుపై మండిపడ్డ సినీ నటి..

Posted: 07/05/2016 01:23 PM IST
Tollywood actress alleges police rude behaviur towards her

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు, జైలుకు వెళ్లోచ్చి బెయిలుపై బయటకు వచ్చచిన సినీ నటి నీతూ అగర్వాల్.. పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. పాత కేసులకు సంబంధించి తనతో కడప, ప్రోద్దుటూరు పోలీసులపై అమె ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్లో సంబంధం లేకున్నా తమ ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారని నీతూ అగర్వాల్ ఆరోపించారు.  సదురు పోలీసులుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. ఎర్రచందనం అక్రమ రవానలో ఎలాంటి సంబంధం లేకున్నా.. తమ ముగ్గురు బంధువులను కడప, ప్రొద్దుటూరు పోలీసులు అకారణంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ బీరంగూడలోని బంధువుల ఇంట్లో నీతూ అగర్వాల్ ఉంటున్నారు.

మరోవైపు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 638 కిలోల బరువు ఉన్న 21 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ టీహెచ్‌డీ రామకృష్ణ వివరాలు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parthiban kanda swamy  neethu agarwal  tollywood actor  police  

Other Articles