నారాలోకేష్ తండ్రికి ఎంత కష్టం వచ్చిందో... | chandra babu naidu not spending time with family

Chandra babu naidu not even spending time with family

Nara Lokesh explained about CBN hard work, CM Chandrababu Naidu Grandson Devansh, Chadrababu not spending time with Devansh, Lokesh Babu Devansh

Nara Lokesh explained how his father hard work for developing state. Even not spending time with family members also. Nara Devansh not recognising his grand father Chandra babu naidu.

నారాలోకేష్ తండ్రికి ఎంత కష్టం వచ్చిందో...

Posted: 07/01/2016 05:13 PM IST
Chandra babu naidu not even spending time with family

నవ్యాంధ్రను దేశంలోనే గర్వించే రాష్ట్రంగా తయారు చేసేందుకు తన తండ్రి చంద్రబాబు నాయుడు పడుతున్న ఆవేదనను పార్టీ జాతీయ కార్యదర్శిగా కాకుండా, ఓ కొడుకుగా లోకేష్ వివరిస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని కష్టాల సుడి నుంచి గట్టెక్కించేందుకు రాత్రింబవళ్లనే తేడా లేకుండా కష్టపడుతున్నారంట. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కూడా సమయం కేటాయించడం లేదని లోకేష్ వాపోతున్నాడు.

తెల్లవారుజామునే నిద్ర లేచి కార్యాలయానికి వెళుతున్న ఆయన అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఇంటికి రావట్లేదు. పనిలో నిమగ్నమయి భోజనం కూడా సరిగ్గా చేయటం లేదు. పోనీ ఇంటికి వచ్చి మనవడితో కాసేపు రిలాక్స్ అవుదామంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెబుతున్నాడు. తన కొడుకు దేవాన్ష్ తన తండ్రిని చూసి ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్లు ఏడుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మనవడిని ముద్దులాడే తీరిక కూడా లేకుండా తన తండ్రి కష్టపడుతున్నారని ఏకరువు పెట్టారు.

విభజన తర్వాత ఏపీ సీఎం హోదాలో సెక్రటేరియట్ కు వెళ్లిన తన తండ్రికి కూర్చునేందుకు కుర్చీ కూడా లేకపోయిందని కూడా లోకేశ్ ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ ఈరోజు సొంత గ్రామం నారావారిపల్లెకు వెళ్లాడు. అక్కడ పై వ్యాఖ్యలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM  Chandrababu Naidu  Nara Lokesh  Nara Devansh  

Other Articles

Today on Telugu Wishesh