This City in China is Sinking 4 Inches Every Year

Beijing is sinking at an alarming rate says report

Beijing, China, environmental, problem, groundwater, sinking, environment, infrastructure latest news, world news

The land under Beijing is sinking by as much as four inches per year because of the overconsumption of groundwater, according to research published in the journal Remote Sensing this month.

ముప్పు పడగ నీడలో చైనా రాజధాని..!

Posted: 06/30/2016 12:46 PM IST
Beijing is sinking at an alarming rate says report

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్రపడిన చైనా రాజధాని బీజింగ్‌కు మరో ప్రమాదకరమైన పర్యావరణ ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ముప్పు పడగ నీడలో బీజింగ్ నగరం సేద తీరుదుందని, ఇది సహేతుకరం కాదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఏడాదికి నాలుగు అంగుళాల చొప్పున ఈ నగరం భూమిలోకి కుంగిపోతోంది. పర్యావరణ పరిస్థితుల పట్ల ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలాగే కొనసాగినట్లయితే మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బీజింగ్ ఓ నాటికి భూగర్భంలో కలసిపోతుంది.

ఎత్తైన భవనాల నిర్మాణాలకు పోటీ పడడం, భూగర్భ జలాలను అతిగా వినియోగించడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌లోని పలు ప్రాంతాలు ఏడాదికి నాలుగు అంగుళాలు అంటే, 11 సెంటీ మీటర్లు భూమిలోకి కుంగిపోతుండగా, నగరంలోని తూర్పు ప్రాంతం మాత్రం ఏడాదికి వంద సెంటీమీటర్ల వరకు కుంగిపోతోందని, గత 80 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని నిపుణులు అంచనా వేశారు. ఎత్తైన భవనాలను నిర్మించడం, భూగర్భ జలాలను ఇష్టానుసారం వాడడంతోపాటు భూపొరల మందం, మట్టి లక్షణాల కారణంగా తూర్పు ప్రాంతంలో కుంగడం ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

2003 నుంచి 2010 మధ్య ఉపగ్రహాల ద్వారా సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా బీజింగ్‌లోని క్యాపిటల్ నార్మల్ యూనివర్శిటీ నిపుణులు ఈ విషయాలను కనుగొన్నారు. ఉత్తర చైనా మైదాన ప్రాంతానికి చివరలోవున్న బీజింగ్ నగరం భూపొరల్లో ఎల్లోనది ఉప నదుల ద్వారా వచ్చి చేరిన మేటలు ఉన్నాయి. ఇవి మెత్తగా ఉండడమే కాకుండా భూఅంతర్భాగంలో నీటి నిల్వలు అతి వేగంగా తరగిపోవడంతో భూమి ఎక్కువగా కుంగిపోతోందని నిపుణులు అధ్యయనంలో అంచనా వేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beijing  China  environmental  problem  groundwater  sinking  environment  infrastructure latest news  world news  

Other Articles