రెండు సార్లు ఎమ్మెల్యే... ఫుట్ పాత్ బతుకు | two times MLA lives on Foot Fath

Two times mla lives on foot fath

Shingara Ram Shahunggra, BSP MLA footfath, MLA on Footfath, Punjab MLA on Footfath, ఫుట్ పాత్ పై ఎమ్మెల్యే, రెండు సార్లు ఎమ్మెల్యే ఇల్లు లేదు, ఎమ్మెల్యే బతుకు రోడ్డుపాలు

Shingara Ram Shahunggra used to be a lawmaker of the Bahujan Samaj Party, but now he lives on the streets with his family in Garhshankar town in Punjab. Even though he belonged to the Scheduled Caste category, Shahunggra contested and won the Garhshankar general category seat in 1992 and 1997

రెండు సార్లు ఎమ్మెల్యే... ఫుట్ పాత్ బతుకు

Posted: 06/23/2016 02:09 PM IST
Two times mla lives on foot fath

నిజాయితీగా ఉండే నేతలకు ఎప్పుడూ కష్టాలే ఎదురవుతాయన్న దానికి నిదర్శనం ఇక్కడ చెప్పబోయే ఉదంతం. కక్ష్య సాధింపు చర్యతో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం రోడ్డుపైన పడింది. అది పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా గర్హ్ శంకర్ పట్టణం. రోడ్ల పక్కన చాలా మంది గుఢారాలు వేసుకుని నివసిస్తున్నారు. అక్కడే  టార్పాలిన్ టెంటు వేసుకుని ఓ కుటుంబం నివసిస్తోంది. అంత మందిలో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ ఇంటి యజమాని శింగార రాం షహుంగ్రా ఎమ్మెల్యేగా పనిచేశారు, అది కూడా రెండుసార్లు.

పంజాబ్ లో బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనను అతి పేద నేతగా అభివర్ణిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రముఖంగా ఓ కథనం ప్రచురించింది. రెండు పర్యాయాలు అధికారం చేతిలో ఉన్నప్పటికీ చిల్లి గవ్వ కూడా ఆయన వెనకేసుకోలేదంట. అంతేకాదు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేని ఎమ్మెల్యే అంటూ అందులో పేర్కొంది. తాజాగా ఆయన ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్ ను పంజాబ్ సర్కారు ఖాళీ చేయించింది. ఆయన అందులో అక్రమంగా ఉంటున్నాడన్నది ప్రభుత్వ వాదన. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది.

‘‘నాకు ప్రభుత్వం నుంచి రూ. 20 వేలు పెన్షన్ వస్తోంది. ప్రస్తుతం ఓ అద్దె ఇంటి కోసం వెతుతుకున్నాను. అప్పటి వరకూ మాకు ఆకాశమే పైకప్పు" అంటూ శింగార రాం వ్యాఖ్యానించారు. బీఎస్పీ మహా నేత కన్షీరాం చివరి క్షణాల్లో ఆయన వెంట ఉన్నందుకు పార్టీ నుంచి ఆయన్ను తొలగించారు. అయితే ఆయన అక్రమంగా ఉంటున్నారనటానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు. నిజాయితీగా నిమ్న కులాల అభ్యున్నతికి కృషి చేయడమే తన తప్పై పోయిందని, ఏనాడూ తాను డబ్బు సంపాదించాలని భావించలేదని, అదే ఇప్పడు తన దుస్థితికి కారణమయిందటూ శిఖరాం వాపోతున్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  BSP MLA  Footfath  

Other Articles