ముద్రగడ పరిస్థితి విషమం? దీక్ష విరమించే అవకాశం | mudragada condition critical may calloff past

Mudragada condition critical may calloff past

mudragada padmanabham, mudragada calloff past, kapu leader past, mudragada padmanabham condition critical, latest news, AP news, politics, mudragada health bulliten, AP political news, తాజా వార్తలు, ముద్రగడ హెల్త్ బులిటెన్, ముద్రగవా వార్తలు, కిర్లంపూడిలో దీక్ష విరమణ, ముద్రగడ దీక్ష విమమణ, ముద్రగడ పద్మనాభం సతీమణి, ముద్రగడ కొడుకు, తెలుగువార్తలు, latest news

mudragada padmanabham condition critical may calloff past.

ITEMVIDEOS: ముద్రగడ పరిస్థితి విషమం?. దీక్ష విరమించే అవకాశం

Posted: 06/20/2016 11:30 AM IST
Mudragada condition critical may calloff past

గత 12 రోజులుగా చేస్తున్న దీక్షతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఓవైపు పరిస్థితి విషమిస్తున్నట్లు ఆయన బంధువులు చెబుతుంటే, ముద్రగడ కుమారుడితోసహా వైద్యులు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెబుతుండటంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తీవ్ర జ్వరం, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన బీపీలో క్రమంగా హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంటున్నాయని బందువులు చెప్పారు. మరో 36 గంటలు ఆయన దీక్షను కొనసాగిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని వారంటున్నారు.

తుని అల్లర్లపై అరెస్ట్ చేసిన 13 మందిని విడుదల చేయాలన్న డిమాండ్ తో ఆయన దీక్ష చేస్తుండగా, కాస్త తగ్గిన ప్రభుత్వం 8 మందిని ఇప్పటికే విడుదల చేసింది. ఇంకా ఇద్దరికి బెయిల్ లభించినప్పటికీ వారిని విడుదల చేయలేదు. మరో ముగ్గురికి అసలు బెయిల్ లభించలేదు. కాగా, వారందరిని విడుదల చేసి తన ముందు ప్రవేశ పెడితేనే దీక్ష విరమిస్తానని ముద్రగడ చెబుతున్నట్లు కాపు నేతలు వెల్లడించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వారంతా వైద్యులకు సూచించినప్పటికీ, అందుకు ముద్రగడ సహకరించట్లేదని తెలుస్తోంది. 'రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్య మెందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికీ తీసుకెళ్లొద్దు. తీసుకు వెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి' అంటూ మొండిపట్టుతో ఉన్నారు.

మరోవైపు ముద్రగడ భార్య పరిస్థితి కూడ రాను రాను ఇబ్బందికరంగా మారుతుందని సమాచారం. పద్మావతికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని ఆమె సోదరుడు సోమేశ్వరరావు చెబుతున్నారు.  పోలీసులు త్వరగతిన కలుగజేసుకుని మిగతావారికి కూడా బెయిల్ మంజూరయ్యేలా చేస్తే మాత్రం,  ముద్రగడ దంపతులు కిర్లంపూడికి వెళ్లి అక్కడే దీక్ష విరమించే అవకాశం ఉంది. మరోవైపు గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో తమ ఒత్తిడి మేరకు సోమవారం సాయంత్రం కల్లా ఆయన దీక్ష విరమింపజేసే అవకాశం ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles