రేప్ చేశాడంట... అయినా కోర్టు వదిలేసింది! Not Rape it was live-in relationship

Not rape it was live in relationship

Delhi High Court Not Rape it was live-in relationship, Delhi High Court acquitted rape accused, Justice Pratibha Rani set aside the judgment passed by a trial court, రేప్ చేసినా వదిలేశారు, రెండు రోజులు రేప్ అయినా వదిలేశారు, తాజా వార్తలు, ఢిల్లీ రేప్, హైకోర్టు ఢిల్లీ రేప్, తెలుగు వార్తలు, జాతీయ వార్తలు, అత్యాచారం కాదు సహజీవనం, latest news, delhi rape case, telugu news

A man who was jailed for 10 years for allegedly raping a woman was acquitted of charges on Saturday by the Delhi High Court which cited that the complainant was in a live-in relationship with the accused, and that her statement didn't inspire confidence. Justice Pratibha Rani set aside the judgment passed by a trial court that found the accused guilty in 2013, and awarded him a sentence of 10 years in jail and a fine of Rs 15,000.

రేప్ చేశాడంట... అయినా కోర్టు వదిలేసింది!

Posted: 06/20/2016 12:38 PM IST
Not rape it was live in relationship

ఒక వ్యక్తి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజులపాటు నిర్భంధించి మృగంలా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి కింది న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది కూడా. కానీ, సుడి బాగుండటంతో పై కోర్టు కేసు కొట్టేసింది. అంతేకాదు అదసలు అత్యాచారమే కాదంటూ అతను నిరపరాదని పేర్కొంది. పైగా ఫిర్యాదు చేసిన మహిళ మోసం చేయాలని చూసిందంటూ తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...

భర్తకు దూరంగా ఉంటూ కూతురు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న తనపై సదరు వ్యక్తి రెండు రోజులు బంధించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గుర్గావ్ కు చెందిన ఓ మహిళ 2011లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 506 (కుట్రపూరిత నేరం) కింద పోలీసులు అతనిపై కేసు పెట్టి పోలీసులు ఊచల్లోకి నెట్టారు. రెండేళ్ల పాటు కేసును విచారించిన ట్రయల్ కోర్టు 2013లో పదేళ్ల జైలు శిక్షను, రూ. 15 వేల జరిమానాను విధించింది. అయితే తాను అత్యాచారం చేయలేదని వాదిస్తూ, నిందితుడు హైకోర్టుకు అపీలు చేయగా, కేసును విచారించిన న్యాయమూర్తి, ట్రయల్ కోర్టు తీర్పును కొట్టేశారు.

అంతేకాదు మహిళ తన దగ్గర 11 వేలు అప్పు తీసుకుందని, పైగా వీరిద్దరూ సహజీవనం చేసినట్టు అతను ఆధారాలు సమర్పించాడు. అంతేకాదు డబ్బులు తిరిగి ఇవ్వాలని అతను కోరటంతోనే ఆమె ఇలా అత్యాచారం అంటూ డ్రామా లాడుతుందని నిందితుడి తరపున న్యాయవాది వాదించాడు.  పదేపదే ఎలా అత్యాచారం చేశారని చెప్పగలరని ప్రశ్నించిన న్యాయమూర్తి ప్రతిభా రాణి, వీరిద్దరూ కొన్ని బలహీన క్షణాల్లో తప్పు చేసి, ఆపై దాన్ని కొనసాగించారని భావిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు విచారణలోని ప్రతి దశలోనూ మహిళ మాట మార్చుతూ రావడం అనుమానంగా ఉందని, దాని ఆధారంగానే కేసు కొట్టేస్తునట్లు తీర్పునిచ్చింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi High Court  Not Rape live-in relationship  rape accused acquitted  

Other Articles