రామ మందిరంపై మరో బాంబు? | Ayodhya Ram temple demolished by Aurangzeb

Ayodhya ram temple demolished by aurangzeb

Ayodhya Ram temple, Aurangzeb, Ayodhya Revisited book, Kishore Kunal IPS about ram mandir, Gujarat cadre IPS on ram mandir, బాబర్ కాదు ఔరంగజేబ్, బీజేపీకి మాజీ ఐపీఎస్ టెన్షన్, యూపీ ఎన్నికలు రామ మందిరం టెన్షన్, రామ మందిరంపై మరో బాంబు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, జాతీయ వార్తలు, రాజకీయాలు, latest news, national politics, telugu news

Ayodhya Ram temple demolished by Aurangzeb. The book "Ayodhya Revisited" has been written by Kishore Kunal, a former Gujarat cadre IPS officer of 1972 batch.

రామ మందిరంపై మరో బాంబు?

Posted: 06/20/2016 10:20 AM IST
Ayodhya ram temple demolished by aurangzeb

అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీకి అయోధ్య వ్యవహారంలో మాత్రం తలనొప్పి తగ్గట్లేదు. ఏళ్ల తరబడి నాన్చుతూ వస్తున్న రామమందిర అంశంపై తాడో పేడో తేల్చాలని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో స్థానిక పార్టీలను కట్టడి చేసి భారీ విజయం సొంతం చేసుకుందామనుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు ఈ అంశంలో మరో చిక్కు ఎదురైంది. అసలు రామమందిరాన్ని బాబర్ కూల్చలేదంటూ ఓ బాంబ్ పేల్చారు మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్.

‘అయోధ్య రీవిజిటెడ్’ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఔరంగజేబు హయాంలో దానిని కూల్చివేశారని అంతా అనుకుంటున్నారు. కానీ, అది కూల్చి వేసింది అసలు బాబర్ అంటూ అందులో పేర్కొన్నాడు. ‘‘అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చివేయమని బాబర్ ఎప్పుడూ ఆదేశించలేదు. నిజానికి ఆయనెప్పుడూ అయోధ్యను సందర్శించలేదు’’ అని పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘బాబర్ నుంచి షాజహాన్ వరకు అందరు చక్రవర్తులు అన్ని మతాలపైనా ఉదారంగా ఉండేవారు. ఆ సమయంలో అయోధ్యలోని సాధుసంతులు ఎంతో ఆనందంగా జీవించేవారు. అవధ్ ప్రాంతంలోని నలుగురు నవాబుల హయాంలో మతసామరస్యం వెల్లివిరిసింది. అయితే ఔరంగజేబు వచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి’’ అని అందులో వివరించారు. ఆయన ఆదేశాలతోనే రామమందిరం కూల్చివేత జరిగిందని తన పుసక్తంలో తెలిపారు.

బీహార్ కు చెందిన కునాల్ 1972 గుజరాత్ కేడర్ అధికారి. ఈ పుస్తకం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. చరిత్రను తిరగేశారు. పురావస్తు శాఖనుంచి వివరాలు సేకరించారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ముందు అక్కడ రామ జన్మభూమి ఆలయం ఉండేదన్న మాట వాస్తవం. అందరూ అనుకుంటున్నట్టు దీనిని 1528లో బాబర్ హయాంలో కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో దాన్ని కూల్చివేశారు. అప్పట్లో ఫెదాయ్ ఖాన్ దానికి గవర్నర్ గా ఉన్నారని పుస్తకంలో కునాల్ వివరించారు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayodhya Ram temple  Aurangzeb  Babar  Ayodhya Revisited book  Kishore Kunal IPS  

Other Articles