Muhammad Ali Dies: 'The Greatest' Boxer Dead at 74

Muhammad ali the boxing legend dies aged 74

muhammad ali, muhammad ali passed away, muhammad ali died, muhammad ali no more, muhammad ali boxing, muhammad ali health, muhammad ali hospitalized, muhammad ali condition, muhammad ali news

Muhammad Ali, one of the greatest athletes in history, former professional boxer, generally considered as the best heavyweight of all time, succumbed to a 32-year battle with Parkinson's disease has passed away at the age of 74.

ది గ్రేటెస్ట్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ కన్నుమూత

Posted: 06/04/2016 09:36 AM IST
Muhammad ali the boxing legend dies aged 74

బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ (74) ఇకలేరు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఏరిజోనా ఆస్పత్రిలో చేర్పించారు. గత కొన్ని రోజులుగా అస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఆయన మరణించారు. కొన్ని గంటల ముందు అలీ బతికే అవకాశాలు చాలా తక్కువని అస్పత్రి వైద్యులు తమకు చెప్పారని కుటుంబ సన్నిహితులు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మెన్లో ఒకడిగా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలారు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యారు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించారు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్ను మూడుసార్లు సాధించారు.  అలీ నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్ను కెరీర్గా ఎంచుకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boxing great  Muhammad Ali passed away  Muhammad Ali  Arizona hospital  

Other Articles