Smriti Irani mocks Rahul Gandhi, says if he becomes Congress president, it will be 'achhe din' for BJP

Rahul as congress chief will be achhe din for bjp says smriti irani

Rahul Gandhi, Smriti Irani, Congress, BJP, Congress president, Achhe Din, Sonia Gandhi, Narendra Modi, Aicc president sonia gandhi, priyanka gandhi

Amid speculations over Rahul Gandhi being elevated as Congress president, BJP leader and Union HRD minister Smriti Irani has taken a jibe at the Congress vice-president

అలా చేస్తే.. బీజేపికి అచ్చేదిన్ వచ్చేసినట్టేనట.. మీకు ఎప్పుడో..

Posted: 06/02/2016 08:24 PM IST
Rahul as congress chief will be achhe din for bjp says smriti irani

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతుండగా, కొంత కాలం ఆగాలని కొందరు సూచిస్తున్నారు. కూతురు ప్రియాంకకే బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడం తమకు బాగా అనుకూలిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ కు పగ్గాలు అప్పగిస్తే.. బీజేపీకి అచ్ఛే దిన్ అంటూ ఎద్దేవా చేశారు.

రెండేళ్లలో మంత్రిగా ఏం చేశారన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. స్కూలు వ్యవస్థపై ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నాం, పిల్లల వివరాలు సేకరించడం ప్రారంభించామన్నారు. ఆ వివరాలు లేని కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని పేర్కొన్నారు. ఢిల్లీలోని జేఎన్యూ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంపై ఆమె స్పందించారు. గతంలో కూడా ఆ వర్సిటీలో వివాదాలున్నాయి. యూపీఏ హయాంలో వర్సిటీలో ఎన్నో జరిగినా ఆ సమయంలో అక్కడ కనిపించని రాహుల్, ఇప్పుడు మాత్రం వర్సిటీకి వచ్చి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ రాజకీయం చేస్తున్నారని స్మృతీ ఇరానీ విమర్శించారు.

కాగా ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాకముందు రామ్, రామ్ అన్న బీజేపి నేతలు ఇప్పుడు రాహుల్, రాహుల్ అంటూ అయన నామజపాన్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ పేరు తీయకుండా బీజేపి మంత్రులు ముఖ్యంగా స్మృతి ఇరానీ వుండలేరన్నారు. రాహుల్ చేతిలో ఓటమితో చావు దెబ్బ తిన్నా ఇంకా అమె ఏ ముఖం పెట్టుకుని రాహుల్ ను టార్గెట్ చేస్తుందని దుయ్యబట్టారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే బీజేపికి అచ్చేధిన్ అని అమె అన్న వ్యాఖ్యలపై కూడా పలువురు మండిపడ్డారు, భీజేపి నేతలు రెండేళ్ల క్రితమే అచ్చేధిన్ వచ్చాయని, కానీ బీజేపి పాలనలో రెండేళ్లు గడిచినా.. ప్రజలకు మాత్రం అచ్చేధిన్ రాలేదని విమర్శించారు.

ఇక జవహార్ లాల్ విశ్వవిద్యాలయంతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థుల వివాదాలు సహజమని, అయితే వాటికి రాజకీయ రంగు పులమకుండా కాంగ్రెస్ వ్యవహరించగా, బీజేపి మాత్రం వాటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ జాతీయ అంశాలుగా మార్చేసిందని దుయ్యబట్టారు, రైతుల కష్టనష్టాలతో పాటు దేశ ప్రజల ఎదుర్కోంటున్న అనేక సమస్యలను పట్టించుకోకుండా, దేశంలో కరువు విలయతాండవం చేస్తున్నా.. అన్ని అంశాలను పక్కదారి పట్టించి రాజకీయం చేయడం బీజేపికే చెల్లిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Rahul Gandhi  achhe din for BJP  congress chief  

Other Articles