ఏక్కడైనా ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్లను ఉపయోగిస్తే డబ్బులు చెల్లించాలి. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా కాదు.. వాళ్లే ఎదురు డబ్బులిస్తారట. ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓ వినూత్నమైన సులభ్ కాంప్లెక్స్‌ను రూపొందించారు. దీన్ని వాడుకునేందుకు మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. నిర్వాహకులే మీకు ఎదురు చెల్లిస్తారు. ఎందుకలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ కాంప్లెక్స్‌లో మానవ వ్యర్థాలను బయో ఇంధనాలుగా మార్చే ఏర్పాట్లున్నాయి.
టాయిలెట్ లోపల ఉండే యంత్రం వ్యర్థాల్లోని నీటిని వేరు చేస్తుంది. మిగిలినపోయిన పదార్థం ఆ తరువాత వేల రకాల సూక్ష్మజీవుల సాయంతో వాసనలేని ఎరువుగా మారిపోతుంది. ఈ ప్రక్రియలో కార్బన్‌డై యాక్సైడ్, మీథేన్ వాయువులు విడుదలవుతాయి. కార్బన్‌డైయాక్సైడ్‌ను బయోడీజిల్ ఉత్పత్తికి పనికొచ్చే నాచు (ఆల్గే) పెంపకానికి వాడతారు. మీథేన్‌ను నేరుగా ఇంధనంగా వాడతున్నారు. వీటితో పవర్ బస్సులతో పాటు స్పేస్ క్రాప్ట్ లు నడిపుతున్నారు.
‘ది సైన్స్ వాల్డెన్ పెవెలియన్’ అని పిలుస్తున్న ఈ కాంప్లెక్స్ బహిరంగ బయోమీ ప్రాజెక్టును పథకంలో భాగంగా నిర్మిస్తున్నారు. వీటి అసలు ఉద్దేశం నీటిని అతితక్కువగా వాడే టాయిలెట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడమనే చెబుతున్నారు ప్రోఫెసర్ జోవన్ చో అన్నారు. ప్రజలను ఈ కాంప్లెక్స్‌కు రప్పించేందుకు ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ కూడా తయారుచేశారు. దీని సాయంతో వ్యర్థాల ద్వారా ఎంత మొత్తంలో ఇంధనం ఉత్పత్తి అవుతుంది, దాని విలువ ఎంత, తదితర వివరాలు తెలుస్తాయట.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more