cops suspects honour killing as father sets ablaze daughter alive

Father sets ablaze to his daughter alive

honour killing, lover, ralative, papagada, killari halli, madakashira, tirumaladevarapalli, shanker nayak, gauramma, saritha, anand nayak, honour killing, set ablaze alive, pavagada ci anand

another brutal incident of honour killling took place in karnataka where father burns daughter alive after hitting her on her head

వరుసకు మామయ్య అయినవాడ్ని ప్రేమించిందని..

Posted: 06/02/2016 08:44 AM IST
Father sets ablaze to his daughter alive

కూతురు వరుసకు మామయ్య అయిన వాడిని ప్రేమించినా తట్టుకోలేని తండ్రులు పరువు హత్యలకు తెగబడుతున్నారు. ఇంతకాలం తన కులం కాదనో, మతం కాదనో సాకులు చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడు ఏకంగా తమ కులస్థుడిని, అందులోనూ వరసైన వాడిని ప్రేమించినా తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఓ యువకుడితో తన కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతుండటాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మరీ దారుణంగా సజీవదహనం చేశాడు. పావగడ తాలూకా కిలార్లహళ్లి సమీపంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

పావగడ సీఐ ఆనంద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం తిరుమలదేవరపల్లి (టీడీపల్లి) తండాకు చెందిన శంకరనాయక, గౌరమ్మ కుమార్తె సరిత(18) అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన ఆనందనాయక అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శంకరనాయక కుమార్తెను మందలించాడు. కొన్నాళ్ల పాటు కూతుర్ని బంధువుల ఇళ్లలో ఉంచాడు. అయినా ఆమె మనసు మారలేదు. దీంతో కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు.

పథకంలో భాగంగా పావగడ తాలూకాలోని తన అత్త ఊరు కిలార్లహళ్లికి తీసుకెళుతున్నానని చెప్పి గతేడాది సెప్టెంబర్ 22న కుమార్తెతోపాటు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కిలార్లహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి రాగానే గొంతుకు చున్నీ బిగించి, తలపై బండ రాయితో మోది ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్తు తెలియని యువతి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి అందించిన సమాచారంతో హత్యకు గురైంది సరిత అని, చంపింది తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుణ్ని బుధవారం అరెస్ట్ చేసి మధుగిరి కోర్టులో హాజరుపరిచారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles