drunken youth attacked petrol bunk staff, who denied sale of petrol in midnight

Petrol bunk staff beaten to death for deniing sale of petrol in midnight

drunkers, petrol bunk, petrol bunk staff, mid night, kukatpally crime, cyberabad crime, drunken youth attacket petrol bunk staff

petrol bunk staff beaten to death by the drunkers for deniing sale of petrol in midnight at kukatpally

పెట్రోల్ పోయలేదని బంకు సిబ్బందిపై..

Posted: 06/02/2016 08:02 AM IST
Petrol bunk staff beaten to death for deniing sale of petrol in midnight

హైదరాబాద్‌ నగరంలో యువత మరీ హింసాత్మకంగా తయారవుతున్నారు. అర్థరాత్రి పెట్రోల్ పోయాడానికి నిరాకరించిన బంకు సిబ్బందితో ఘర్షణ పడ్డారు. అప్పటికే మద్యం మత్తులో జోగుతన్న యువకులు తమకు ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ కావాలని బంక్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ కోసం బంకు సిబ్బందితో గొడవపడిన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి సిసిటీవీ ఫూటే్జ్ లను పరిశీలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్లితే....కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆరుగురు యువకులు పెట్రోల్ కోసం వచ్చారు. అప్పటికే పెట్రోల్ బంక్ మూసి వేశారు. మద్యం మత్తులో ఉన్న వారు పెట్రోల్ పోయాలంటూ గొడవకు దిగి బంక్ సిబ్బందిపై దాడి చేశారు. క్యాషియర్ సంఘమేశ్వర్, మేనేజర్ రాజులపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టి పరారయ్యారు. వీరి దాడిలో సంఘమేశ్వర్ అక్కడే మృతి చెందగా, రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles