NOTA sees a dip in Kerala, Tamil Nadu and Puducherry, gains in Assam, WB

The nota effect in 2016 assembly polls

nota button, non of the above, note voters incresed, bengal nota voters, west bengal assembly elections, tamilnadu assembly elections, Kerala Assembly elections, assam assembly elections, puducherry assembly elections, Kerala polls 2016, west bengal polls 2016, tamil nadu polls 2016, assam polls 2016, pudducherry polls 2016,

Voters in Tamil Nadu, Kerala and Puducherry voted relatively less for the None of the above (NOTA) option in the May 16 elections when compared to the 2014 Lok Sabha elections, the first time it was effected.

నోటాపై అక్కడి ఓటర్లకు మక్కువ ఎక్కువే..

Posted: 05/22/2016 01:35 PM IST
The nota effect in 2016 assembly polls

నోటా బటన్ తన బలాన్ని మెల్లిమెల్లిగా నిరూపించుకుంటుంది. ఈ సారి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఓటర్లు నోటా కు మొగ్గు చూపిన వారు కూడా అనేకం వున్నారు. పై వారెవరూ కాదు (నన్‌ ఆఫ్‌ ది అబో- నోటా).. అని ఈవీఎంలపై ఉండే ఈ మీటనే తాజా ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును ఓటర్లకు కల్పిస్తున్న నోటాకు పశ్చిమ బెంగాల్‌లో భారీగా ఓట్లు పోలయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌లోని చాలా నియోజకవర్గాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌, ప్రతిపక్ష వామపక్ష-కాంగ్రెస్ కూటమి, బీజేపీల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి. దీంతో 'నోటా'నే నాలుగో పోటీదారుగా చాలాచోట నిలిచింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన బీఎస్పీ, సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎస్‌యూసీఐ, స్వతంత్ర అభ్యర్థుల కంటే కొన్నిచోట్ల నోటాకే అధిక ఓట్లు రావడం గమనార్హం. ఇదే తరహా పరిస్థితి ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పుదుచ్చేరి, తమిళనాడు, అసోంలోనూ కనిపించింది.

ఇక్కడ కూడా 'నోటా'కు ఓటర్లు గణనీయంగానే మొగ్గుచూపారు. ఒక్క కేరళలో మాత్రం 'నోటా'కు చాలా తక్కువమంది ఓటు వేశారు. అసోంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే 'నోటా'కే ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. బెంగాల్‌లో 6.6 కోట్ల ఓటర్లు ఉండగా, అందులో 8లక్షలకుపైగా మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 'నోటా'కు ఓటు గుద్దారు. బెంగాల్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఐదులక్షలకుపైగా 'నోటా'ను వినియోగించుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nota button  non of the above  note voters incresed  bengal nota voters  mamata benerjee  

Other Articles