Deputy Chief Minister helpless in his own ministry!!

Address grievances or face action warns deputy cm

Deputy chief minister, revvenue minister KE Krishnamurthy, 700 endorsements, ke helplessness, ke sensational comments, ke dissatisfied with revenue officials work, KE krishnamurthy, revenue department, Joint collectors meeting, CCLA director AC Punetha, Revenue principal secretay JC Sharma, andhra pradesh

Deputy chief minister and incharge of the revenue ministry KE Krishnamurthy expressed his exasperation of the tardy pace of works in his own ministry.

మరోమారు ఢిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. సొంతశాఖపై అసహనం

Posted: 04/27/2016 10:37 AM IST
Address grievances or face action warns deputy cm

తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టంతా అమరావతిపైనే వుందని, తమ రాయలసీమ ప్రాంతాని అయన పక్కకు పెట్టారంటూ.. నిర్మోహమాటంగా తన మనస్సులోని భావనను బయటపెట్టిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మళ్లీ అదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి పార్టీ పరంగా ప్రాంతాల పరంగా కాకుండా తన శాఖ పరంగా ఆయన వ్యాఖ్యాలు చేశారు. తాను పర్యవేక్షిస్తున్న రెవెన్యూశాఖలోనే  తన ఆదేశాలపై కూడా సక్రమంగా సమాధానాలు రావడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

రెవెన్యూ శాఖలో అలసత్వం పెచ్చుమీరుతోందని, అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని లేని పక్షంలో ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కొనక తప్పదని ఆయన అన్నారు.  ఏళ్ల తరబడి అర్జీలు పరిష్కారం కావడంలేదని, దీనిపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ల (జేసీల)తో సచివాలయంలో జరిగిన కాన్ఫరెన్సులో కేఈ మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో తాము ఎన్ని సంస్కరణలు తెచ్చినా కొందరి అలసత్వం వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏడాది కాలంగా తాము 700 ఎండార్స్‌మెంట్లు జిల్లాలకు పంపితే 51కి మాత్రమే జవాబులు వచ్చాయి.. వాటిని కూడా పరిష్కరించలేదని కేవలం లెటర్లు మాత్రమే పంపించారని ఆయన మండిపడ్డారు. మేం పంపిన వాటికి కూడా ఏడాది దాటినా సమాధానం రాకపోతే ఎలా? ఒక స్వాతంత్య్ర సమరయోధుని భార్య విశాఖ జిల్లాలో 40 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆమె ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేస్తే మన వాళ్లు అక్కడ చెట్లకు 40 ఏళ్లు లేవని రిపోర్టు ఇచ్చారు. ఆఫీసులో కూర్చుని రిపోర్టు ఇచ్చినట్లు ఉంది. చిత్తూరు జిల్లాలో వనజ అనే మహిళ.. భర్త, మామపై కేసు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె వస్తే తాను ఎండార్స్ చేయగా, దానికి రెండు నెలలుగా నాకు జవాబే లేదు.  హైకోర్టు నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు

ఆర్డీవోలు, తహశీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏళ్లయినా అర్జీలు పరిష్కరించడంలేదని.. కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి అని అధికారులే చెప్పడమేంటని, అయితే ఇక రెవెన్యూ శాఖలో అధికార యంత్రాంగం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టి జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతోందన్నారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం వెనుకాడదని కేఈ కృష్ణమూర్తి అధికార యంత్రాగాన్ని హెచ్చరించారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KE krishnamurthy  revenue department  Joint collectors meeting  andhra pradesh  

Other Articles