mysura reddy | bjp | congress | YSRCP | Resigns | tdp | mysoora reddy | seperate rayalaseema state agitation

Mysoora reddy to resign ysrcp to start seperate rayalaseema state agitation

mysura reddy, resign, ysrcp, ys jagan, hyderabad, andhra pradesh, mysoora reddy, YSRCP, TDP, CONGRESS, BJP, Mysoora Reddy, Senior leader, Jagan Mohan Reddy

YSRCP Senior Leader Mysura Reddy Resigns to YSRCP to start a seperate rayalaseema state agitation .

జగన్ కు షాక్.. వైసీపీకి మైసూర గుడ్ బై.. తదుపరి బాటపై అనిశ్చితి

Posted: 04/27/2016 10:01 AM IST
Mysoora reddy to resign ysrcp to start seperate rayalaseema state agitation

ప్రలోభాలకు గురవుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి వలసపోవడంతో ఇప్పటికే ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై అవినీతి చక్రవర్తి అనే పుస్తకాన్ని విడుదల చేసి 24 గంటలు కూడా గడవకముందే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. పార్టీలో పితామహుడి హోదాను అలకరించిన సీనియర్ నేత, వైఎస్ అప్తమిత్రుడు, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి మరికాసేపట్లో ఆ పార్టీని విడనున్నారు.

వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో ఉన్న మైసూరా... పార్టీ వీడేందుకే నిర్ణయించుకున్నారని సమాచారం. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన వైసీసీ పార్టీకి రాజీనామా చేసి అనంతరం ఆయన పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖను కూడా రాయనున్నారు. తానెందుకు రాజీనామా చేస్తున్నానో కూడా మైసూర.. జగన్ కు ఆ లేఖలో వివరించనున్నారు. ఆ లేఖను మైసూరా నేరుగా జగన్ కే పంపనున్నట్లు తెలుస్తోంది. జగన్ సొంత జిల్లా కడపకే చెందిన మైసూరారెడ్డి పార్టీ వీడటం వైసీపీకి తీరని నష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మైసూరారెడ్డి... పార్టీలో కొంతకాలం పాటు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన దాదాపుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం మానేశారు. అసలు పార్టీ కార్యాలయానికి కూడా ఆయన వచ్చిన దాఖలా లేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నా.. ఇవాళ ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను తిరిగేసిన ఆయన తదుపరి ఏ పార్టీలో చేరతారన్న అంశంపై రకరకాల చర్చలకు తావిస్తుంది. కాగా ఆయన ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించనున్నారని మరికోన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ బాటపై అనిశ్చితి నెలకొంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YCP  TDP  CONGRESS  BJP  Mysoora Reddy  Senior leader  

Other Articles