Karnataka CM Siddaramaiah to be replaced by high command..?

Karnataka cm siddaramaiah s future uncertain

siddaramaiah, congress, chief minister, yeddurappa, karnataka, sm krishna, parameshwaram, sonia gandhi, uttatakhand, harish rawath, yeddurappa cases, mallikarjun kharge,

According to sources S M Krishna and G Parameshwara in the race to replace Karnataka CM Siddaramaiah

సిద్ధయ్యకు పదవీ గండం.. యడ్డీ రాకతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం..

Posted: 04/27/2016 11:24 AM IST
Karnataka cm siddaramaiah s future uncertain

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చకచకా చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక కమల దళాధిపతిగా మరో పర్యాయం యడ్యూరప్పను బీజేపి అధిష్టానం తెరపైకి తీసుకురావడంతో.. అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగ్రత్త చర్యల కింద ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించాలని భావిస్తుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. సామాన్యుడిగా, నిరాడంబరుడిగా అందరివాడిగా పేరొందిన సిద్దరామయ్యపై ఇటీవల కాలంలో అరోపణల పర్వం శృతి మించిన నేపథ్యంలో కాంగ్రస్ అధిష్టానం ఆయనను తప్పించి.. ఆ పదవిలో మరో మచ్చలేని నాయకుడికి అందించాలని భావిస్తుంది.

ఇటీవలి కాలంలో చేతి గడియారం నుంచి తన కుమారుడికి కాంట్రాక్టులు కట్టబెట్టడం వరకు సిద్దరామయ్య  ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఈ అంశాలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే కర్ణాటక బీజేపీ విభాగం పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తిరిగి చేపట్టడం కూడా కాంగ్రెస్ లో గుబులు రేగడానికి ఒక కారణంగా తెలుస్తోంది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా అక్రమ భూ కేటాయింపులు జరపడంతో పాటు పలు అక్రమాలలో తన ప్రమేయం, తన కుటుంబ సభ్యుల ప్రమేయం వుందని అరోపణతో పదవికి దూరమైయ్యారు యడ్యూరప్ప. ఆ తరుణంలో బీజేపిని వీడి తన నేతృత్వంలో ఒక పార్టీని స్థాపించి భంగపడ్డారు. అదే తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల నాటికి తన పార్టీని బీజేపీలో కలిపేసి మళ్లీ బీజేపి కండువా కప్పుకున్నారు. అయితే ఆయనపై వచ్చిన అవినీతి అరోపణలపై ఇంకా న్యాయస్థానాలలో విచారణ ఎదుర్కోంటున్నా.. బీజేపి మాత్రం ఆయనకే మరోమారు రాష్ట్ర పగ్గాలను అందించింది.

ఇందుకు బీజేపికి కారణం లేకపోలేదు. కర్ణాటకలో బలంగా వున్న లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు పగ్గాలను అందిస్తే.. మరోమారు అధికారంలోకి రావచ్చని బీజేపి కలలు కంటోంది, ఈ నేపథ్యంలోనే ఆయనకు మరోమారు పగ్గాలు అందించిందిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకోనుందా..? అందుకే తెరపైకి సిద్దరామయ్యను మర్చే అంశాన్ని తీసుకువచ్చిందా..? అన్న వార్తలు వినబడుతున్నాయి.

సీఎం పీఠం దక్కించుకోగల అవకాశం ఉన్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ ఎం కృష్ణతోపాటు, ప్రస్తుతం ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ ఎం కృష్ణ తనకున్న పలుకుబడిని పూర్తి స్థాయిలో ఉపయోగించి మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, అదే సమయంలో దళిత నేత అయిన ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వరను సీఎం చేయడం వల్ల మరింత ప్రయోజనం సిద్ధిస్తుందని అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో దళితులు చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉండడంతోపాటు పరమేశ్వర మచ్చలేని నేత కావడం ప్లస్ పాయింట్ అని అధిష్టానం భావిస్తుందట.

కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించడం వెనుక సిద్ధరామయ్య కష్టం, వ్యూహాలే ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చడం వల్ల రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందని, దీనినే విపక్షాలు ప్రచారాస్త్రాలుగా చేసుకునే అవకాశం వుందన్న వాదనలు కూడా వినబడుతున్నాయి, యడ్యూరప్ప అవినీతి కేసులు, రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోగానే అయన తీసుకున్న కోటి రూపాయల కారు బహుమానం, ఉత్తరాఖండ్ లో బీజేపి సాగిస్తున్న రాజకీయ అనిశ్చితి, రహస్య బేరసారాలను కర్ణాటకలో ప్రచారస్త్రాంగా వినియోగించాలని మరో వర్గం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనుందట. అంతేకాని ముఖ్యమంత్రి అభ్యర్థిని మర్చాలన్న ప్రతిపాదనకు కూడా స్వస్తి పలకాని సూచిస్తుందట. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎటు మొగ్గుతుందో.. ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siddaramaiah  congress  chief minister  yeddurappa  karnataka  sm krishna  parameshwaram  sonia gandhi  

Other Articles