Air India hired to turn Vijay Mallya jet spic and span before sale

Vijay mallya s overseas assets must be disclosed to banks says supreme court

foreign assets, Vijay Mallya, family, Supreme Court, banks, Air India, private jet, spic and span, sale, SC on Mallya, Supreme Court, Kingfisher Airlines, Mallya's loan

The Supreme Court directed Vijay Mallya to disclose all the overseas assets held by him and his estranged wife and children to the banks.

మాల్యాపై సుప్రీం అగ్రహం.. అమ్మకానికి ప్రత్యేక ప్రైవేటు ఫ్లైట్

Posted: 04/26/2016 06:21 PM IST
Vijay mallya s overseas assets must be disclosed to banks says supreme court

బ్యాంకులకు కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, తప్పించుకున్న తిరుగుతున్న మద్యం వ్యాపారి, దేశ అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు మాల్యాను ఆదేశించింది.

మాల్యా విదేశీ ఆస్తులతో పాటు అతని కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మాల్యా కుటుంబ సభ్యుల ఆస్తుల ప్రకటనలో ఎలాంటి జాప్యం చేయొద్దని, ఈ వివరాలను గడువులోగా బ్యాంకులకు సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో తన భార్య, పిల్లల ఆస్తులకు రక్షణ క్పలించాలంటూ విజయ్ మాల్యా వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, కాగా సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన అదేశాలను తన క్లయింట్ మాల్యాపై ఎలాంటి క్రిమినల్ చర్యలకు వాడుకోకూడదని అతని తరఫున లాయర్ సీఎస్ వైద్యనాథన్ సుప్రీంను కోరారు.

ఇక మరోవైపు మాల్యా కు చెందిన అత్యంత ఖరీదైన  విమానాన్ని వేలం వేసేందుకు సర్వీస్ ట్యాక్స్ శాఖ సన్నధమైంది. సుమారు166 కోట్ల రూపాయలతో నవంబర్ 2006  కొనుగోలు చేసిన స్పెషల్ జెట్ కు మరిన్ని కోట్లు వెచ్చించి  హంగులు అమర్చారు. ముఖ్యంగా  బార్, భోజనాల గది, బెడ్ రూమ్, వంటగది, వాష్ రూం లాంటి విలాసవంతమైన సౌకర్యాలను పొందుపరిచాడు. వజ్రాలు పొదిగిన  బాలాజీ చిత్రాపటం, మరో నాలుగు పికాసో చిత్రాలు సహా ఇతర ఖరీదైన కళాఖండాలు లోపల అమర్చాడు.

అయితే పన్నులు చెల్లించడంలో  విఫలం కావడంతో  ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం  ఎయిర్ ఇండియా ఎయిర్ భారతదేశం ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఎయిర్ బస్ ఎ 319 ని ముస్తాబు  చేశారు. చాలా మరమ్మతులు, హంగులు అమర్చిన అనంతరం ఈ మే 12, 13  తేదీల్లో ప్రభుత్వ నిర్వహణలోని ఎంఎస్టిసి లిమిటెడ్  దీన్ని వేలానికి పెట్టనున్నారు. అయితే   ఎయిర్ బస్ లోని  మాల్యా పిల్లల ఫోటోలతో పాటు, ఖరీదైన చిత్రాలను  మినహాయించి వేలం వేయనుంది.

మాల్యా నుంచి తనకు రావలసిన రూ.370 కోట్లకు పైగా పన్ను బకాయిలను రాబట్టేందుకు సర్వీస్ ట్యాక్స్ శాఖ తాజాగా మాల్యా ప్రైవేట్ విమానాన్ని అమ్మకానికి పెట్టింది.  మే 12-13 తేదీల మధ్య ఈ -133 సిజె విమానాన్ని వేలం వేయనుంది. ఇంజనీరింగ్ కంపెనీ సిబ్బంది ఇప్పటికే  విమానం లోపలా, బయటా  శుభ్రం చేసిందనీ, 22 సీట్లు ఎయిర్బస్ 319 ని అందంగా తీర్చిదిద్దారని  విమానాశ్రయం అధికారి ఒకరు  వెల్లడించారు. ఇక ఇప్పటికే పాస్ పోర్టును రద్దు చేయడంతో ఇరుకున పడ్డ మాల్యాప అరెస్టు వారెంటు కూడా జారీ చేయనున్నారనే వార్తల వినబడుతున్నాయి.
 
జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Supreme Court  Kingfisher Airlines  United Breweries  United Kingdom  

Other Articles