mla jaleel khan men attacked journalist shafi

Mla jaleel khan s men attack scribe shafi

jaleel khan, vijayawada west mla, vijayawada press club, press club treasurer, shafi, kaktiya magazine editor, attack on journalist, journalist attacked in vijayawada, mla disciples attacked journo, mla jaleel khan men attacked journalist shafi, kakatiya magazine editor, journalist

vijayawada west mla jaleel khan men man handled journalist for taking photos, while he was abusing muslims who conducted meeting without informing him

ITEMVIDEOS: ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జులుం.. మీడియా ప్రతినిధిపై దాడి చేయించిన వైనం

Posted: 04/23/2016 02:22 PM IST
Mla jaleel khan s men attack scribe shafi

సమైక్య రాష్ట్రంలో ఏకంగా అప్పటి ఆంధ్రపదేశ్ పిసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పై అరోఫణలు గుప్పించి రాష్ట్రస్తాయిలో పతాకశీర్షకల్లో వార్తలు రాయడంతో అఖిలాంద్ర పాఠకులకు సుపరిచితుడయ్యాడు ఆయన. సరిగ్గా 2009 ఎన్నికలకు ముందు తనకు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు డీఎస్ తనయుడు లంచం డిమాండ్ చేశాడని అరోపణలు గుప్పించాడు. ఆలా రాష్ట్రవ్యాప్తంగా తన పేరును పరిచయం చేసుకున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రాష్ట్ర విభజన అనంతరం వైపీసీ నుంచి పోటీ చేసి గెలుపోందాడు.

అయితే తనకు టిక్కెట్ ఇచ్చి అధరించిన పార్టీని నట్టేట ముంచి తాను మాత్రం గమ్యానికి చేరుకోవాలన్న తాపత్రయపరుడతని ఇటీవల ప్రతిపక్ష పార్టీ వైసీపీని వదిలి అధికార టీడీపీ పక్షాన చేరి ఆ పార్టీ కండువాను కప్పేసుకున్నాడు. అయితే ఇలా పార్టీ మారడంతో ఆయనకు భారీగానే సూట్ కేసులు ముట్టాయని, దీంతో పాటు పలు పోస్టులపై కన్నేసిన ఆయన అ మేరకు చాకచక్యంగా పావులు కూడా కదపుతున్నారని సమాచారం.

అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేగా తన అహంభావాన్ని మరోమారు చాటి తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు. ఎన్నికలలో తన గెలుపు కోసం వాడుకున్న మీడియాను ఇప్పడు చావ చితకోట్టమని అదేశించాడు, ప్రతిపక్షంలో వున్నప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు అవసరమైన మీడియాను అస్త్రంగా వాడుకున్న ఆయన.. తాజాగా అధికారపక్ష సభ్యుడిగా మారాగానే మీడియా ప్రతినిధిపై దాడి చేయించడమే కాక ‘‘ఎక్కువ మాట్లాడకు... జైల్లో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’’ అని బెదిరించారు. దీంతో బిత్తరపోయిన సదరు మీడియా ప్రతినిధి జలీల్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకెళితే... నగరంలోని తారాపేటలోని జలీల్ ఖాన్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదు, ముస్లిం శ్మశానవాటిక చాలా భాగం నష్టపోనున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం ప్రముఖులు శ్మశాన వాటిక వద్ద నిన్న రాత్రి సమావేశమయ్యారు. అయితే, తనకు చెప్పకుండా సమావేశం కావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన జలీల్ ఖాన్ అక్కడికి వెళ్లి అందరినీ బూతులు తిట్టారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న విజయవాడ ప్రెస్ క్లబ్ కోశాధికారి, కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ... అక్కడికి వెళ్లి తన సెల్ ఫోన్ తో ఫొటోలు తీయడం ప్రారంభించారు.

దీనిని గమనించిన జలీల్ ఖాన్... ‘‘ఎవడ్రా ఫొటోలు తీస్తోంది... వాడిని కుమ్మండ్రా’’ అని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారంతా మీడియా ప్రతినిధినంటూ చెప్పినా..  షఫీపై భౌతిక దాడికి దిగారు. ఆయన ఫోన్ నెలకేసి కోట్టి మరీ ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేతో షఫీ మాట్లాడబోగా ‘‘ఎక్కువ మాట్లాడకు... జైల్లో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’’ అని జలీల్ ఖాన్ ఊగిపోయారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి బయటపడ్డ షఫీ... జలీల్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaleel khan  vijayawada west mla  vijayawada press club  shafi  kakatiya magazine  editor  journalist  

Other Articles