ఆ రెస్టారెంట్ లో బట్టలు లేకుండా భోజనం | Naked Dining

Naked dining london to get its first clothing optional restaurant

Restaurant, London, Naked dining, లండన్, నగ్నంగా భోజనం

If your ideal dining experience involves public nudity, then you’re in luck. London is about to open its first ‘clothing-optional’ pop up restaurant. The Bunyadi will open in June with diners granted access on a first-come first-serve basis. The current waiting list has more than 12,100 names. For those who wish to try the pop up without having to expose themselves, worry not. There will be two sections, a “pure” section, or naked zone, and a clothed section. It’s not

ఆ రెస్టారెంట్ లో బట్టలు లేకుండా భోజనం

Posted: 04/22/2016 10:21 AM IST
Naked dining london to get its first clothing optional restaurant

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లు ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. వ్యాపారం చేస్తూనే దాన్ని కొత్తగా చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాగే తాజాగా లండన్ లో ప్రారంభించిన కొత్త రెస్టారెంట్ గురించి వార్తల్లో హైలెట్ గా నిలుస్తోంది. ఆ రెస్టారెంట్ స్పెషాలిటి ఏంటి అనుకుంటున్నారా.? అక్కడ నగ్నంగా భోజనం చేయడం! అది కూడా సొంతంగా ఆస్వాదించేందుకు ప్రాధాన్యం. వీటన్నింటికి తోడు వడ్డించే వారు కూడా అదే విధంగా ఉండటం.

లండన్లో రాబోతున్న ఈ హోటల్ ను స్థానిక ఔల్ కేఫ్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభించేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని వెల్లడించగానే వావ్ క్రేజీ…అంటూ ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు మేం వచ్చేస్తాం అంటూ ప్రతిపాదన పెట్టారు!!

కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు ‘నేకెడ్ రెస్టారెంట్’ (నగ్న రెస్టారెంట్) విశేషాలు ఏంటంటే… దుస్తులు తొలగించి అంటే నగ్నంగా భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదు కాబట్టి స్వేచ్ఛగా లొట్టలేసుకుంటూ తినవచ్చు. ఎవరూ తొంగి చూసే అవకాశం కూడా లేకుండా వెదురుతో పార్టిషన్ చేసి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. వడ్డించేవారి సంగతి ఏంటనేదే కదా సందేహం… వారు కూడా ఈ రెస్టారెంట్ కు తగినట్లు కురుచ దుస్తులు ధరించి అలరిస్తారు.

ఇంతకీ విడిచిన దుస్తులు – ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకోవడం ఎలా అనుకుంటున్నారా?  వాటిని భద్రంగా దాచుకునేందు ప్రత్యేక లాకర్ల వసతిని హోటలే స్వయంగా కల్పిస్తోంది. ఇంతటితో ఈ క్రేజీ రెస్టారెంట్ విశేషాలు అయిపోలేదు. పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి స్పెషల్ అట్రాక్షన్స్. ఎక్కడైనా మొహమాటం ఎదురవుతుందేమోనని ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంచారట. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. వీటన్నింటితో పాటు ‘నేకెడ్” మాత్రమే కాదు ‘నాన్ నేకెడ్’ సెక్షన్ కూడ వేరుగా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Restaurant  London  Naked dining  లండన్  నగ్నంగా భోజనం  

Other Articles