ఖమ్మంలో రాజకీయ వేడి | Polictical Heat in Khammam

Polictical heat in khammam

Paleru, Khammam, TRS, TDP, Congress, KTR, పాలేరు, ఖమ్మం, ఎన్నికలు, తుమ్మల, నామా, కేటీఆర్

Ruling Telangana Rashtra Samiti (TRS) is in no mood for compassion when it comes to encashing its ever growing popularity and strength in the Legislative Assembly. Setting aside the tradition of leaving an Assembly seat where a member dies to his or her kin in by-elections, TRS decided to contest Paleru by-election and it's not just casual effort this time - the party is fielding senior minister Tummala Nageshwara Rao in the fray.

ఖమ్మంలో రాజకీయ వేడి

Posted: 04/22/2016 07:43 AM IST
Polictical heat in khammam

ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సమరానికి కాలు దువ్వుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు నామా నాగేశ్వరరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఫైర్ అయ్యారు. తుమ్మలకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. టీడీపీని వాడుకుని వదిలేసిన తుమ్మలను ఓడించి తీరతామని నామా చెప్పారు. ఇందుకోసం విపక్షాలన్నీ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

అధికార పార్టీ బెదిరింపులకు తాము బెదిరేది లేదని ప్రకటించిన నామా... పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, పాలేరులో పోటీకి తాను సిద్ధమేనని ప్రకటించారు. పాలేరు బై పోల్ కు సంబంధించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఖమ్మం జిల్లాలోనూ పాగా వేయాలని చూస్తున్న కేసీఆర్.. జిల్లాకు చెందిన బలమైన నాయకుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తమ పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వర్ రావుకే గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles