ఎవరీ గౌతమిపుత్ర శాతకర్ణి..? | Who is gauthamiputra Shatakarni

Who is gauthamiputra shatakarni

Gautamiputra Satakarni, Gautamiputra Satakarni cinema, Telugu King Gautamiputra Satakarni, Balayyan, Balakrishna Gautamiputra Satakarni, Balakrishna 100 film, గౌతమిపుత్రశాతకర్ణి, బాలయ్య, బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ

Gautamiputra Satakarni (IAST gautamīputra śatakarṇi) was a ruler of the Satavahana Empire. The exact date of Gautamiputra's reign is uncertain. His reign is dated variously:

ఎవరీ గౌతమిపుత్ర శాతకర్ణి..?

Posted: 04/22/2016 11:19 AM IST
Who is gauthamiputra shatakarni

గౌతమీపుత్రి శాతకర్ణి. ఇప్పుడు తెలుగు వారు నినదిస్తున్న పేరు. తెలుగు వారి కీర్తిపతాకాలను నలువైపుల ఎగరవేసిన ఈయన గురించి మనలో చాలా మందికి తెలియదు. నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో సినిమాగా ’గౌతమీపుత్ర శాతకర్ణి‘ని ఎంచుకోవడంతో మరోసారి ఈయన గురించి తెర మీదకు వచ్చింది. చరిత్రలో నిలిచిపోయేలా తీస్తున్న బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి.. తెలుగు వారికి చరిత్రను మరోసారి పరిచయం చేస్తుంది అనడంతో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

గౌతమిపుత్ర శాతకర్ణి గురించి..

శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు, "గౌతమీపుత్ర శాతకర్ణి". గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజు అయ్యాడు. ఆయన తండ్రి హయంలో రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ, శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉంది. "గౌతమీపుత్ర శాతకర్ణి" శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. "గౌతమీపుత్ర శాతకర్ణి" భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. భారతీయ పంచాంగం(కాలండరు) "గౌతమీపుత్ర శాతకర్ణి" (శాలివాహనుని) పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది.

ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ద్వారా, "గౌతమీపుత్ర శాతకర్ణి" ఘనత తెలుసుకోవచ్చు. ఈ శాసనాలు బట్టి, "గౌతమీపుత్ర శాతకర్ణి" గొప్ప యుద్ధవీరుడు అని, అనేక క్షత్రియ రాజ వంసాలను జయించి " క్షత్రియ దర్పమాన్మర్ధన " అనే బిరుదు తెచ్చుకున్నాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాని జయించి, "త్రిసముద్రతోయ పీతవాహన" అనే బిరుదు తెచ్చుకున్నాడు. అంతే కాదు "గౌతమీపుత్ర శాతకర్ణి" గొప్ప ప్రజా సేవకుడు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని, న్యాయబద్ధంగా పన్నులు విదిస్తూ, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేస్తూ, జనరంజక పాలన అందిచేవారు. ఆయనకు "ఏక బ్రాహ్మణుడు " అనే బిరుదు కుడా ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లిపట్ల ఎనలేని భక్తిని ప్రదర్శించి తన పేరులో తల్లి పేరును కలుపుకున్నాడు. ఈ అన్ని కారణాల వల్ల , "గౌతమీపుత్ర శాతకర్ణి" శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన తరువాత క్రీ.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి రాజ్యం చేపట్టాడు.ఈ గౌతమీపుత్రడి గొప్పతనం ఇప్పటికి మన అమరావతిలో శాసనాలు ద్వారా, స్థూపాలు ద్వారా ప్రతిబంబిస్తూనే ఉంటుంది. మన అమరావతి వైభవం అంతా ఆ శాతవాహనులతోనే చరిత్రలో కలిసిపోయింది.

ఇప్పుడు మళ్ళి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన తర్వాత, ఆ వైభవం మనకి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది. టీవీలు ద్వారా, పుస్తకాలు ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనం మన గొప్ప చరిత్ర తెలుసుకుంటున్న తరుణంలో, మన బాలయ్య సిల్వర్ స్క్రీన్ మీద, చరిత్రలో మన గొప్పతనం ఏంటో మన కళ్ళకి కట్టినట్టు చుపించాబోతున్నారు. ఈ చరిత్ర, నేటి యువతకు స్పూర్తిగా ఉంటూ, మనది ఇంత గొప్ప చరిత్ర, మనం ఏదైనా చెయ్యగలం అన్న ఆత్మస్థ్యైర్యాన్ని నింపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles