jaggampet ycp mla jyothula nehru joins TDP

Senior leader jyothula nehru joins tdp

YSR Congress mla jyothula nehru, Ycp Deputy Floor leader Jyothula Nehru, TDP, Telugu Desam party, YSRCP, defections, telugu desam, chandra babu, lokesh, YS Jagan Mohan Reddy, PAC Chairman post, Parupula Subbarao, Vanthala Rajeshwari,

YSR Congress MLA from Jaggampet in East Godavari district, Jyothula Nehru joins the Telugu Desam Party at a programme in the city on Monday.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ

Posted: 04/11/2016 06:01 PM IST
Senior leader jyothula nehru joins tdp

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ రెండో దశ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాలు పూర్తికాగానే.. సరిగ్గా ధుర్మిఖీ నామ సంవత్సరం ప్రారంభైన రెండు రోజులకే విపక్ష పార్టీలోంచి సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట ఎమ్మెల్యే జోత్యుల నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జ్యోతుల నెహ్రూ సహా ఆయన అనుచరులు పెద్ద స్థాయిలో టీడీపీలో చేరారు.
 
జ్యోతుల నెహ్రూను టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెహ్రూతో పాటు 36 మంది సర్పంచులు, 43 మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కాగా, జ్యోతుల నెహ్రూతో కలుపుకుని టీడీపీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుకుంది. మరికోందరు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా త్వరలోనే పార్టీలోకి అహ్వానిస్తామని పార్టీ వర్గాలు పేర్కోంటున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jyothula nehru  tdp  telugu desam  chandra babu  lokesh  ysrcp  ys jagan  

Other Articles