AP CM Chandrabau Naidu very busy in birth day celebrations

Ap cm chandrabau naidu very busy in birth day celebrations

AP, CM, Chandrababu Naidu, Nara Devanshu, Devanshu Birth Day

AP CM Chandrbabu naidu grand son Nara Devanshu first birth day celebrations will conduct grandly in Vijayawada.

పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా చంద్రబాబు

Posted: 04/08/2016 11:33 AM IST
Ap cm chandrabau naidu very busy in birth day celebrations

ఏపిలో అధికారులు, నాయకులు అందరూ ఓ ఫంక్షన్ కోసం హడావిడి చేస్తున్నారు. అంత హడావిడి చేస్తున్నది ఏ పెళ్లికో కాదు.. కేవలం ఓ పుట్టిన రోజు కోసం మాత్రమే. అదేంటి పుట్టిన రోజుకు అంత హడావిడి ఎందుకు చేస్తారు అనుకుంటున్నారా..? అది మామూలు వ్యక్తిది కాదు. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు గారి మనమడి పుట్టిన రోజు వేడుక. నారా దేవాన్ష్ మొదటి పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో నేడు ఏర్పాటవుతున్న విందు... భారీ విందుగానే కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆహ్వానాలు పంపిన చంద్రబాబు ఏర్పాట్లన్నింటినీ పక్కాగా చేయిస్తున్నారు.

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు తన మనుమడి పుట్టిన రోజు వేడుకకు ఏర్పాటు చేసిన విందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించేందుకు చంద్రబాబు ఏకంగా 750 ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఇప్పటికే ఈ ఆహ్వాన పత్రికలు ఆహ్వానితులకు చేరిపోయాయి. ఈ ఆహ్వానాలతో పాటు సప్లిమెంటరీగా మరో పత్రికను కూడా అందజేశారట. ఆహ్వానితులతో పాటు వారి భార్య/భర్త, లేక ఓ సహాయకుడిని లోపలికి అనుమతిస్తారు. ఆహ్వానాల వెంటే విందు జరిగే ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లోకి ఎంట్రీ కోసం ఆహ్వానితులకు స్మార్ట్ కార్డులను కూడా అందజేశారు. ఈ స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తేనే లోపలికి ఎంట్రీ లభిస్తుందట. 750 ఆహ్వానాలతో మొత్తం 1,500 మంది ఈ విందుకు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక అక్కడ విందును మాత్రం 2 వేల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విందు విజయవాడలోనే జరుగుతున్నా, ఆహార పదార్థాలను మాత్రం హైదరాబాదుకు చెందిన తాజ్ హోటల్ అందజేయనుంది. ఈ మేరకు చంద్రబాబు కుటుంబం మెనూ బాధ్యతలను తాజ్ హోటల్ కు అప్పగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  CM  Chandrababu Naidu  Nara Devanshu  Devanshu Birth Day  

Other Articles