RK Roja suspension case, supreme to hear on 4th

Sc to hear rk roja suspension case on 4th

high court, supreme court, Assembly, Speaker, yanamala ramakrishnudu, kodela shiva prasadrao, High Court, suspension petititon, roja, YSRCP,, privileges committee, ap legislative assembly, ysrcp mlas, chevireddy bhaskar reddy, rk roja, yanamala ramakrishnudu, kotamreddy sridhar reddy, jyothula nehru, kodali nani

Supreme Court division bench to start hearing on YSRCP MLA RK Roja suspension case petition on april 4th

అర్కే రోజా సస్సెన్షన్ కేసు.. సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు

Posted: 04/02/2016 01:01 PM IST
Sc to hear rk roja suspension case on 4th

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే అర్కే రోజా దాఖలు చేసిన పిటీషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 4న విచారణ జరపనుంది. తాను అసెంబ్లీకి హాజరు కావచ్చునని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ అమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రోజా గత నెల 29న పిటిషన్ దాఖలు చేయగా ముందుగా ఈ నెల 1న విచారణ జరుపుతామని చెప్పిన న్యాయస్థానం.. ఆ రోజున విచారణ సమయం మించిపోవడంతో ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది,

అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ అసెంబ్లీలో ప్రజల తరఫున గట్టిగా గొంతు వినిపిస్తే ఆ గొంతును నొక్కేయాలన్న అధికార పక్షం ఆలోచనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నగరి నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం, అసెంబ్లీ ధిక్కరించాయి. ఇలా చేయడం న్యాయస్థాన గౌరవాన్ని తగ్గించడమే. దీనిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నా. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా..’ అని రోజా చెప్పారు. ‘స్పీకర్‌కు అన్ని అధికారాలూ ఉంటాయని అంటున్నారు.

అయితే ఆ అధికారాలను సభా కార్యకలాపాలు జరగడానికి ఉపయోగిస్తారు గానీ ఇలా కక్ష సాధింపు కోసం ఉపయోగించరు. సభకు అంతరాయం కలిగించారనుకుంటే ఆ సెషన్ వరకే సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ రోజా నచ్చలేదు కాబట్టి ఏడాది చేస్తామనడం దుష్ట సంప్రదాయం. దీనికి న్యాయస్థానం తెర దించుతుందుని ఆశిస్తున్నా..’ అని అన్నారు. కాగా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నేరవేర్చలేదన్నారు.  శివరాజ్‌సింగ్ చౌహాన్, మోదీ, నవీన్ పట్నాయక్‌లు ప్రజల మన్ననలు పొందారు కాబట్టి వారిని గెలిపిస్తున్నారని, మిమ్మల్ని ఎందుకు  గెలిపిస్తారని చంద్రబాబును రోజా ప్రశ్నించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles