Robots seling Mobiles

Robots seling mobiles

Robots, Mobiles, Phones, Tokyo

Robots are replacing humans in every where. Recently robots selling robots in Tokyo

రోబోలు మొబైల్స్ అమ్మెన్

Posted: 03/25/2016 12:31 PM IST
Robots seling mobiles

రోజుకు మనుషులు రోబోల్లాగా తయారవుతుంటే.. రోబోలు మాత్రం మనుషులు చెయ్యాల్సిన అన్ని పనులు చేస్తున్నాయి. తాజాగా మొబైల్ ఫోన్లు అమ్మే పనని రోబోలు చేస్తున్నాయి. ఎలాంటి అనుమానాలున్నా క్లారిఫై చేస్తూ బిజినెస్ ను ఒంటరిగా డీల్ చేస్తున్నాయి.  టోక్యోలో సాఫ్ట్ బ్యాంకు ఏర్పాటు చేసిన మొబైల్ షోరూంలో మొత్తం 10 పెప్పర్ హ్యూమనాయిడ్ రోబోలు పనిచేస్తున్నాయి. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్ ఫోన్లను అమ్ముతున్నాయి. ఈ పెప్పర్ రోబోలను ఫ్రాన్స్‌కు చెందిన అల్డెబరాన్ రోబోటిక్స్ సంస్థ తయారుచేసింది.  ఇప్పటికే ఇలాంటి రోబోలు కొన్ని జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి.

కాగా పూర్తిగా రోబోలే ఓ షోరూంను నిర్వహించడమన్నది వాల్డ్ లోనే ఇది తొలిసారి. వినియోగదారుల ప్రశ్నలకు ఇవి సమాధానమిస్తాయి. సూచనలూ అందిస్తాయి. మన ముఖ కవళికలను పసిగట్టే పరిజ్ఞానం వీటి సొంతం. మన వాయిస్ ను గమనించడం ద్వారా మనమేం అనుకుంటున్నామన్న విషయాన్ని ఇవి గ్రహించగలవట. మన భావాలనూ అర్థం చేసుకోగలవు. తొలి దశలో భాగంగా ఈ స్టోర్ ఈ నెల 30 వరకూ నడుస్తుంది. ఒక్కో పెప్పర్ రోబో ధర రూ. లక్ష.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robots  Mobiles  Phones  Tokyo  

Other Articles