Sai Pratap joins Telugudesam in the presence of Chandrababu Naidu

Former union minister sai pratap joins tdp party

sai pratap, Ex MP, Rajampet, TDP, AP chief Minister, chandrababu naidu, Ysrcp, former union minister sai pratap, cm ramesh, tdp leader cm ramesh, ys rajashekar reddy, ys jagan, kadapa, andhra pradesh, congress

congress leader and former union minister sai pratap joins tdp in presence of party national president chandrababu naidu

టీడీపీ తీర్ధం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్

Posted: 03/24/2016 10:56 AM IST
Former union minister sai pratap joins tdp party

కేంద్ర మాజీమంత్రి ఎ. సాయి ప్రతాప్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన్ని టీడీపీలోకి పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. యూపీఏ హయాంలో సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా సాయి ప్రతాప్ విజయం సాధించారు. అయితే గతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.మిథున్ రెడ్డి చేతిలో సాయి ప్రతాప్ ఓటమి పాలైయ్యారు.

సాయి ప్రతాప్ టిడిపిలో చేరడం వైసిపి అధినేత జగన్‌కు గట్టి షాకేనని చెప్పవచ్చు. ఇప్పటికే సొంత ఇలాకా కడపలో సొంత పార్టీకి చెందిన నేతలు సైకిల్ ఎక్కారు. ఇప్పుడు సొంత జిల్లాకు చెందిన బలమైన నేత, కాంగ్రెస్ సీనియర్ నేత సాయి ప్రతాప్ చేరడం కూడా కడపలో జగన్‌కు ఝలక్ అని చెప్పవచ్చు. సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ కడప జిల్లాలో బలమైన నేత కావడం గమనార్హం. కడప జిల్లా రాజంపేట లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు పోటీ చేసిన సాయిప్రతాప్ ఆరుసార్లు విజయం సాధించారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సాయిప్రతాప్ అత్యంత సన్నిహితుడిగా భావించేవారు. వైయస్ అనుచరుడుగానే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఐదుసార్లు సుదీర్ఘకాలం పాటు ఎంపీగా కొనసాగిన సాయి ప్రతాప్.. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్ లో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రాజంపేట నియోజకవర్గ భౌగోళిక స్వరూపం నేపథ్యంలో ఇటు కడప జిల్లాలోనే కాక అటు చిత్తూరు జిల్లాలోనూ సాయిప్రతాప్‌కు మంచి పట్టుంది.

వైయస్ మరణానంతరం సాయిప్రతాప్ వైసీపీలో చేరడం ఖాయమన్న వాదన వినిపించింది. అయితే తన తండ్రి సమకాలీనుడైన సాయిప్రతాప్‌ను జగన్ అంతగా పట్టించుకోలేదంటారు. దీంతో, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన సీఎం రమేష్.. సాయి ప్రతాప్‌ను టిడిపిలోకి తీసుకురావడంలో చక్రం తిప్పారని తెలుస్తోంది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగా పలు  పదవులను అధిరోహించిన సాయిప్రతాప్.. వైఎస్ తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీలో చేరడంపై ఆయన అనుయాయువులు విమర్శలను గుప్పిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai pratap  Ex MP  Rajampet  chandrababu naidu  ys jagan  kadapa  andhra pradesh  congress  

Other Articles