attempted to kill Bal Thackeray

Attempted to kill bal thackeray

Dacid Headly, Pakistani, Shiva sena, Bal Thackeray, To kill Bal Thackeray, America

Pakistani-American terrorist David Headley told a court that an attempt was made on late Shiv Sena Chief Bal Thackeray's life. But, he maintained that he did not have a first-hand knowledge about the life attempt. When probed further on the matter, Headley told the court that the person who tried to attack was arrested but managed to escape from police custody.

బాల్ ధాక్రేని చంపేందుకు ప్లాన్

Posted: 03/24/2016 11:06 AM IST
Attempted to kill bal thackeray

శివసేన చీఫ్ బాల్ థాకరేను హతమార్చాలని అప్పట్లో ప్లాన్ వేసినట్లు ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తెలిపారు. ముంబై దాడుల కేసులో హెడ్లీని వీడియో లింక్ ద్వారా విచారిస్తున్నారు. లష్కరే ఉగ్రవాది సాజిద్ మీర్ ఆదేశాల మేరుకు థాకరేను చంపాలనుకున్నట్లు హెడ్లీ తెలిపాడు. థాకరేను చంపేందుకు రెక్కీ వేయాలనుకున్నాం, దాని కోసం రెండు సార్లు శివసేన భవన్‌కు వెళ్లినట్లు హెడ్లీ కోర్టుకు తెలిపాడు. శివసేన నేతపై లష్కరే హత్యా ప్రయత్నాలు చేసిందని హెడ్లీ స్పష్టం చేశాడు. అమెరికా కోర్టులో క్షమాపణ కోరలేదని, ముంబై కోర్టులో మాత్రం గతంలో క్షమించమని అభ్యర్థన చేసినట్లు హెడ్లీ చెప్పాడు.

ముంబై కోర్టుకు సత్యాలను వెల్లడించినంత మాత్రన తనకు అమెరికా కోర్టులో రక్షణ దొరకదన్నాడు. పేరు మార్పు కోసం అమెరికా పాస్‌పోర్ట్ అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వలేదన్నాడు. కాగా అంతకు ముందు డేవిడ్ హెడ్లీకి సంబందించి వివరాలను రాబట్టే క్రమంలో ఆయన భార్య ఎవరు అని ప్రశ్నించగా ఆయన చాలా కఠువుగా సమాధానం చెప్పారు. నాభార్య ఎవరైతే మీకెందుకు.. నాకు తెలిసిన విషయాలు అన్నీ చెబుతున్నాను కదా. అంటూ సమాధానమిచ్చారు. కాగా బాల్ ధాక్రేను చంపేందుకు వేసిన ప్లాన్ కు సంబందించి శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dacid Headly  Pakistani  Shiva sena  Bal Thackeray  To kill Bal Thackeray  America  

Other Articles