KCR three hours restless speech

Kcr three hours restless speech

KCR, assembly, KCR Speech, Assembly, Telangana

KCR gave speech in Assembly for three hours without any break. He told his govt. vision.

మూడు గంటలు ఏకధాటిగా మాట్లాడిన కేసీఆర్

Posted: 03/14/2016 10:24 AM IST
Kcr three hours restless speech

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనమండలిలో సుధీర్ఘ ప్రసంగం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సుమారు మూడు గంటల పాటు ఏకధాటిగా ఆయన మాట్లాడారు. అది ఇది అని లేకుండా అన్ని అంశాలపైనా విపక్షాలకు క్లారిటి ఇస్తూ వారిని మాట్లాడకుండా చేశారు.

సీఎం ప్రసంగంలోని ము‌‌ఖ్యాంశాలు:

* సంక్షేమానికి అగ్రతాంబూలం వేశాం. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 పింఛను ఇస్తే మేము రూ.1000 ఇస్తున్నాం.
* కాంగ్రెస్‌ హయాంలో 29లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. మా హయాంలో ప్రభుత్వం 35.7లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. బీడీ కార్మికులకు రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నాం
* ఖర్చుకు వెనుకాడకుండా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా అమలు చేస్తాం
* పింఛన్లు పెంచాం, రేషన్‌ కార్డులు పెంచాం, బీడీ కార్మికులను ఆదుకుంటున్నాం
* బంగారుతల్లి పథకం మేము అమలు చేయం.. చేయదలచుకున్నదే చెబుతాం
* 2016 డిసెంబర్‌ నాటికి 6,182 గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు నీరందించాం
* పంచాయతీరాజ్ శాఖకు అతి ఎక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే
* తెలంగాణలో గూగుల్‌, కాగ్నిజెంట్, ఆమెజాన్ వంటి దిగ్గజ పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి
* ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు
*  లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకే అప్పగించాం. లబ్ధిదారుల ఎంపికలో ఒక్క పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై వేటు వేస్తాం.
* హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టం రూ.218 కోట్లు. ఆర్టీసీని పటిష్టం చేసి లాభాల బాటలో నిలుపుతాం.
*ఆర్టీసీ బలోపేతానికి రూ.700 కోట్లు ఇచ్చాం. పేదలకు ఉండే ఏకైక రవాణా వ్యవస్థ ఆర్టీసీ.
* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ఐపాస్‌ తీసుకొచ్చాం. సుమారు రూ.33వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం.
* జహీరాబాద్‌ నిమ్స్‌కు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది.
* వైద్యులు, పారామెడికల్‌ పోస్టులు భర్తీ చేస్తాం. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం
* తొలి విడతలో 50శాతం రైతు రుణాలు మాఫీ చేశాం. ఈ బడ్జెట్‌ కేటాయింపులతో మలివిడత 75శాతం పూర్తవుతాయి.
* దూరదృష్టితో మేము తీసుకున్న నిర్ణయం వల్ల విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా రైతులకు పంపిణీ చేశాం
* త్వరలో 21 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ చేసుకునేలా త్వరలో అందుబాటులోకి గోదాంలు
* రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సాహసోపేతమైన నిర్ణయం. పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి.
* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ఐపాస్‌ తీసుకొచ్చాం. సుమారు రూ.33వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం.
* జహీరాబాద్‌ నిమ్స్‌కు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది.
* వైద్యులు, పారామెడికల్‌ పోస్టులు భర్తీ చేస్తాం. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న అన్ని ఖాళీలు నింపుతాం.
మిషన్‌ భగీరథను కచ్చితంగా పూర్తి చేసి, తెలంగాణ ప్రజలకు నీరందిస్తాం
* ఏడాది నుంచి బీసీలకు ‘కల్యాణలక్ష్మి’ పథకం అమలు
* గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు రూ.250 కోట్లు
* జంటనగరాల్లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి.
* జంట కమిషనర్ల పనితీరు అద్బతం
* మునుపటిలా పోలీసులు మామూళ్లు అడగడంలేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  assembly  KCR Speech  Assembly  Telangana  

Other Articles