Central govt getting ready to increase assembly seats in telugu states

Central govt getting ready to increase assembly seats in telugu states

Ap, Telangana, Assembly seats, KCR, Jithendre Reddy

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and his Telangana counterpart K. Chandrasekhar Rao took different stands on many issues in the AP Reorganisation Act, but both the CMs are unanimous on one issue “increasing the number of Assembly seats” in both states.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు అంతా సిద్దం

Posted: 02/17/2016 08:42 AM IST
Central govt getting ready to increase assembly seats in telugu states

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో శాసనసభ స్థానాల పెంపు త్వరలోనే సాకారం కానుంది. రెండు రాష్ర్టాల్లోనూ ఏకకాలంలోనే సీట్ల పెంపు ప్రక్రియ పూర్తికానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనున్నది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గెజిట్ ఉత్తర్వుల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ర్టాల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గత సంవత్సరం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీలు డాక్టర్ కే కేశవరావు, బీ వినోద్‌కుమార్ మరోసారి సమావేశమై సాంకేతిక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ఈ బిల్లు గురించి ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించారు. వెంకయ్యనాయుడితో పాటు న్యాయశాఖ కార్యదర్శి మల్హోత్రాతో ఈ విషయమై చర్చించామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని.. ఇప్పటికే అటార్నీ జనరల్ మౌఖికంగా సమ్మతి తెలియజేశారని జితేందర్‌రెడ్డి వివరించారు. అటార్నీ జనరల్ నుంచి లిఖితపూర్వకంగా సమ్మతి రాగానే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక నివేదికను కేంద్ర క్యాబినెట్‌కు పంపుతుంది. అక్కడ ఆమోదం లభించగానే, న్యాయ మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26కు సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లును తయారుచేస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతుంది అని జితేందర్‌రెడ్డి వివరించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Telangana  Assembly seats  KCR  Jithendre Reddy  

Other Articles