Finally KTR Wife utilize her vote in Himayathnagar

Finally ktr wife utilize her vote in himayathnagar

KTR, KTR Wife, Himayathnagar, Shailema

KTR wife Shailema vote missed in Banjarahills voter list. After some tme she voted in Himayathnagar,

మొత్తానికి ఓటు వేసిన కేటీఆర్ భార్య

Posted: 02/02/2016 12:13 PM IST
Finally ktr wife utilize her vote in himayathnagar

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించిన తెలంగాణ ఐటీ మంత్రి, పంచాయితీ రాజ్ మంత్రి కేటీఆర్ భార్యకు ఓటు లేదని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే అన్ని మీడియా ఛానల్స్ లో కూడా దీని మీద తీవ్ర చర్చసాగింది. కాగా ఆమె హిమాయత్ నగర్ 9వ నెంబర్ వీధిలోని సెయింట్ ఆంటోని స్కూల్ పోలింగ్ కేంద్రంలో శైలిమ ఓటు వేశారు. హైదరాబాద్లో శైలిమకు ఓటు హక్కు లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశమైంది. శైలిమకు హిమాయత్ నగర్లో ఓటు ఉన్నట్టు అధికారులు గుర్తించడంతో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా అంతకు ముందే.. ఉదయాన్నే తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా... తన భార్య ఓటు మాత్రం లేదని తెలిసింది. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ నివసిస్తారు. కేటీఆర్కు ఈ డివిజన్లోనే ఓటు హక్కు ఉండగా, శైలిమకు మాత్రం ఇక్కడ ఓటు లేదు. కేటీఆర్ బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కానీ బంజారాహిల్స్ లో కాకుండా కేటీఆర్ భార్యకు హిమాయత్ నగర్ లో ఓటు హక్కు ఉండటం గమనార్హం. మొత్తానికి మంత్రి గారి సతీమణికే ఓటు హక్కులేదు అన్న వార్తకు తెర పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  KTR Wife  Himayathnagar  Shailema  

Other Articles