జాత్యహంకారం మరోసారి బయటపడింది. ఓ సిక్కును, ముస్లింను ఫ్లైట్ నుండి దింపేసిన ఘటన మీద అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. దీని మీద ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. టోరంటో నుండి న్యుయార్క్ వెళ్తున్న ఫ్లైట్ లో కూర్చున్న ఓ సిక్కు మతస్తుడు, ముగ్గురు ముస్లింలను ఫ్లైట్ సిబ్బంది దించేశారు. అసలు తమను ఎందుకు దిగాలని అంటున్నారో కారణం చెప్పాలంటూ అడిగిన వారికి ఫ్లైట్ సిబ్బంది పరుషంగా సమాధానమిచ్చింది. ప్రశాంతంగా ఫైట్ దిగాలని లేదంటే కుదరదు అని బెదిరించారని వారు పరువు నష్టం దావా వేశారు.
షాన్ ఆనంద్, ఫైముల్ ఆలంల పట్ల విమాన సిబ్బంది కఠినంగా వ్యవహరించింది. అయితే ఫ్లైట్ నడుపుతున్న పైలెట్ అన్-ఈజీగా ఫీలవుతున్నారని అందుకే తమను దించుతున్నట్లు వెల్లడించారని వారు దావాలో పేర్కొన్నారు. రిపబ్లిక్ ఎయిర్ వేస్ అనే ఎయిర్ వేస్ వాళ్ల ఫ్లైట్ లో ఈఘటన చోటుచేసుకుంది. అయితే దీని మీద ఎయిర్ వేస్ వాళ్లు మాత్రం ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. కాగా షాన్ ఆనంద్ అనే వ్యక్తి మాత్రం విమానంలో తన అనుభవాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. ఓ చంటి బిడ్డతో ఉన్న తల్లి తనను చూసి భయపడిందని... ఆమె కళ్లలో భయం కనిపించదని వెల్లడించారు. అయితే తాము చూడడానికి ఓ వర్గానికి చెందిన వారిగా కనిపిస్తున్నందునే తమను ఆమె అలా చూసిందని బాధపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more