Crime has won but our fight will continue, says Nirbhaya's mother

December 16 gangrape case juvenile convict to walk free on sunday

nirbhaya, december 16 gangrape, nirbhaya juvenile verdict, nirbhaya case, delhi gang rape, december 16 gang rape, nirbhaya juvenile case, nirbhaya juvenile release, delhi gang rape case,

Nirbhaya juvenile verdict: The youngest convict in the December 16 gangrape case will walk free on Sunday. The heinous incident took place in 2012.

న్యాయంపై అన్యాయమే గెలిచింది.. బాధితుల వ్యాఖ్య.. 20న విడుదల

Posted: 12/18/2015 07:56 PM IST
December 16 gangrape case juvenile convict to walk free on sunday

నిర్భయపై అత్యాచారం చేసిన బాల నేరస్థుడి విడుదలను అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు ఇవాళ తాజాగా స్పష్టం చేసింది. దీంతో గత మూడు ఏళ్లుగా ఈ కేసులో శిక్ష అనుభవించిన నిందితుడికి న్యాయస్థానం ఊరటనిచ్చింది. దారుణ నేరాలకు పాల్పడిన నిందితుడిని అప్పుడే తిరగాడే సభ్య సమాజంలోకి వదలవద్దని, అతడికి మరింత కఠిన శిక్ష విధాంచాలని తమ అవేదనను వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులకు మాత్రం ఎదురుదెబ్బ తగిలింది.

ఈ కేసులో నిందితుడు ఈ ఆదివారం విడుదల కానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ుట జువెనైల్ జస్టిస్ బోర్డ్ మాత్రమే ఈ విషయంలో నిర్ణయించగలదని తెలిపింది. చివరకు అన్యాయమే న్యాయంపై విజయం సాధించిందని.. తమకు న్యాయం లభించలేదని.. నిర్భయ తల్లిదండ్రులు తెలిపారు. మిగతా నిందితుల మాదిరిగా ఉరితీయాల్సిందేనన్నారు. 2012 డిసెంబర్ 16న నిర్భయపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపరిచారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  delhi gangrape  nirbhaya juvenile verdict  

Other Articles