No basis for raid, Karti Chidambaram fumes after another ED search

Chidambaram calls govt foolish as ed raids firms linked to son

karti chidambaram, ed raids karti chidambaram, karti chidambaram ed raids, Karti Chidambaram ED raids 'Karti firms' Former finance minister, ed raids chennai, chennai news, india news

P Chidambaram said he wanted to “see how far a foolish government will go in harassing Karti (Chidambaram)” hours after the Enforcement Directorate conducted raids on firms allegedly linked to his son.

చిదంబరానికి చిర్రెత్తుకోచ్చింది.. అప్పుడు చెలగాటం.. ఇప్పుడు ప్రాణ సంకటం

Posted: 12/18/2015 07:04 PM IST
Chidambaram calls govt foolish as ed raids firms linked to son

ఆయన మాజీ కేంద్ర మంత్రి. అలాంటిలాంటి మంత్రి కాదు. అత్యంత కీలకమైన రెండు శాఖల బాధ్యతలు చేపట్టిన అయన. తాను కేంద్ర హోం మంత్రిగా వున్నప్పుడు చేయించిన ఆ పనులు అప్పట్లో అయనకు చెలాగాటంగా మరాగా, ఇప్పుడు మాత్రం అవే పనులు కేంద్రం తన తనయుడిపై చేస్తుండగా, అవి ప్రాణసంకటంగా మారాయి. అందుకనే ఆయన ఎన్నాళ్లు ఈ వేధింపులు అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరనేగా అయనే కేంద్ర మాజీ హోం, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో తన తనయుడు కార్తి చిదంబరంపై ఈడీ సాగిస్తున్న దర్యాప్తులు, దాడులు ఎన్నాళ్లంటూ ఆయన్న కేంద్ర ప్రభుత్వంపై రుసురుసలాడారు.

ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందం వెనుక అవినీతి వెలుగులోకి రావడం,.. దీంట్లో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం పేరు బయటపడటంతో గత నెల 30న ఆయన కార్యాలయాలు, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. అయితే, మరో మారు బుధవారం దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో ఈ దాడులు జరిగాయి

తన మీద ఎయిర్‌సెల్, మాక్సీస్ ఒప్పంద వ్యవహారాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కార్తీ విమర్శించారు. ఈ వేధింపులెన్నాళ్లంటూ చిదంబరం సైతం ఓ ప్రకటన లో ఘాటుగా స్పందించారు. పాలకులు తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన  కుమారుడి కార్యాలయంలో ఎలాంటి ఆధారాలు లభించ లేదని, ఇదే విషయాన్ని కార్తీ సైతం స్పష్టం చేశాడని గుర్తు చేశారు. అయితే, కార్తీకి వ్యతిరేకంగా ప్రయత్నాలు సాగుతున్న విషయం తేటతెల్లమవుతోందని పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా గమనించిన వారు మాత్రం అధికారంలో వుంటే చెలగాటం.. విఫక్షంలో వుంట ప్రాణసంకటమా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : p chidambaram  congress leader  karthi chidambaram  

Other Articles