Mumbai artist Hema Upadhyay, her lawyer found dead, bodies stuffed in cartons

Mumbai police probes property family dispute angle into twin murder of hema upadhyay her lawyer

hema upadhyay, hema upadhyay laweyer, hema upadhyay murder, hema upadhyay body drain, mumbai drain bodies, chintan upadhyay, harish bhambani, mumbai news, crime news, india news

Mumbai artist Hema Upadhyay, her lawyer found dead, bodies were found by locals in Kandivali in a drain near a cemetery

ITEMVIDEOS: ప్రముఖ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ హత్యకేసు.. పోలీసుల అదుపులో అమె భర్త

Posted: 12/14/2015 01:13 PM IST
Mumbai police probes property family dispute angle into twin murder of hema upadhyay her lawyer

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కందివలిలో ప్రముఖ ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్ హత్యకు గురయ్యారు. ఆమె లాయర్‌ హరీశ్‌ను కూడా చంపేసి కార్డ్‌బోర్డ్ బాక్సుల్లో పెట్టి డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇద్దరు మృతదేహాలను కట్టేసి, ప్యాక్ చేసి బాక్స్‌లో పెట్టారు. శవాలపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. హత్యలకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. జాతీయ లలిత్ కళా అకాడమీ అవార్డ్ గ్రహీత హత్య కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

ఈ కేసులో ఆస్తుల వ్యవహారంతో పాటు కుటంబ తగాదాల కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ్‌ను అరెస్ట్ చేశారు. హేమ, చింతన్‌ల వివాహం 1998లో జరిగుగా..2010లో వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2013లో హేమ తన భర్త చింతన్‌పై వేధింపుల కేసు పెట్టారు. ఈ కేసును వాదిస్తున్న లాయర్‌ హరీశ్‌ను కూడా చంపేసి కార్డ్‌బోర్డ్ బాక్సుల్లో పెట్టి డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇద్దరి మృతదేహాలను కట్టేసి, ప్యాక్ చేసి బాక్స్‌లో పెట్టారు. దీంతో అమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chintan upadhyay  harish bhambani  Hema Upadhyay  mumbai police  

Other Articles