ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఇటీవల జరిగిన దాడుల కంటే మరింత భయంకరమైన దాడులు నిర్వహిస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సంస్థ ప్రకటించింది. భవిష్యత్తులో పారిస్ లో అత్యంత జుగుప్సాకరమైన పరిస్థితులు కనిపించేలా బీభత్సం సృష్టిస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. ఇందుకు ట్రయల్ గా.. 2009లో విడుదలైన ‘జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా’ సినిమాలోని వీడియో క్లిప్ ని విడుదల చేసింది.
ఆ వీడియో క్లిప్ ప్రకారం.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈఫిల్ టవర్ను ఓ క్షిపణి బలంగా ఢీకొట్టడంతోపాటు చిన్న రొబోటిక్ డిస్ట్రాయర్స్ ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ టవర్ అందరు చూస్తుండగా నది మీదుగా కూలిపోతుంటుంది. ఆ తరహాలోనే తాము కూడా భవిష్యత్తులో దాడులు నిర్వహిస్తామన్నట్లుగా పారిస్ కు హెచ్చరికలు పంపించినట్లవుతుందని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఈ వీడియోకు 'పారిస్ కుప్పకూలిపోయింది' అని పేరుపెట్టి మరీ విడుదల చేసింది. ఆ సినిమాలో ఈఫిల్ టవర్ కూలిపోయే సందర్భాన్ని చూస్తే.. ఒళ్లు ఎంత గగుర్పొడుస్తుందో తాము దాడులకు దిగినప్పుడు అలాంటి భయాందోళనలే కలుగుతాయని ఐఎస్ హెచ్చరించింది.
‘ఇప్పుడే ఏమైంది.. ఇంకా ఘోరమైన దాడులు పారిస్ లో నిర్వహిస్తాం.. ఆ నగరం కుప్పకూలిపోవడం ఖాయం’ అంటూ ఆ వీడియోలో ఆ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఐసిస్ విడుదల చేసిన ఈ వీడియో నేపథ్యంలో పారిస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more