hindustan is for hindus assam governor stirs controversy

Assam governor stirs controversy says hindustan is for hindus

assam governor, pb acharya, Hindustan, Hindus, muslims, hindus, indian hindus, muslims, indian muslims, latest news, assam, padmanabha balakrishna

Terming India as the "most tolerant country in the world", Assam Governor Padmanabha Balakrishna Acharya today said all Indian-origin people, including Muslims, persecuted in any foreign lands were welcome in the country.

అసోం గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఖండించిన కాంగ్రెస్

Posted: 11/22/2015 04:23 PM IST
Assam governor stirs controversy says hindustan is for hindus

హిందుస్థాన్ హిందువుల దేశమని,  నేషనల్ రిజిస్టర్ ఫర్‌ సిటిజెన్స్ (ఎన్‌సీఆర్) ఆధునీకరణలో ఒక్క బంగ్లాదేశీ పేరు కూడా నమోదుచేయకుండా చూడాలని అసోం గవర్నర్‌ పీబీ ఆచార్య పేర్కొన్నారు. ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీఆర్‌ ఆధునీకరణలో భాగంగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చిన శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేయడంపై వివాదం తలెత్తగా.. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు భారత్‌లో ఆశ్రయం పొందవచ్చునని, ఇతర దేశాల్లోని హిందువుల్లో భారత్‌లో ఆశ్రయం పొందడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు.

'హిందుస్థాన్ హిందువుల దేశం. ఈ విషయంలో ఏ సందేహాలకు తావు లేదు. వివిధ దేశాల్లోని హిందువులంతా ఇక్కడ నివసించవచ్చు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి ఎలా ఆశ్రయం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది' అని ఆయన పేర్కొన్నారు. కాగా గవర్నర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ రాష్ట్రానికి గవర్నర్ లా కాకుండా ఆర్ ఎస్ ఎస్ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ఈ ఘటనతో బిజేపి అసలు నైజం మరోమారు బయటపడిందని సీఎం తరుణ్ గగోయ్ విరుచుకుపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam governor  pb acharya  Hindustan  Hindus  

Other Articles